AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munjya OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ.. ఒంటరిగా చూసే ధైర్యముందా..?

జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించగా.. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈమూవీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది.

Munjya OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ.. ఒంటరిగా చూసే ధైర్యముందా..?
Munjya Movie
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2024 | 11:11 AM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో హారర్ కామెడీ మూవీస్ చూసేందుకు సినీ ప్రియులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు విభిన్నమైన కంటెంట్ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. తాజాగా థియేటర్లలో సూపర్ హిట్ అయిన హారర్ కామెడీ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు తీసుకువచ్చారు. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జె్ట్‏తో రూపొందించిన చిత్రం ముంజ్యా. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించగా.. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈమూవీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రస్తుతం ముంజ్యా చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలో విడుదలైన ఈ చిత్రాన్ని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేకుండా సడెన్ గా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది హాట్ స్టార్. థియేటర్లలో విడుదలైన 11 వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. మరి మిగతా భాషలలో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు.

హరర్ ఎలిమెంట్లతోపాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అటు భయపెట్టించే సీన్స్.. ఇటు నవ్వించే కామెడీతో ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో శార్వరి, అభయ్ వర్మతోపాటు సత్యరాజ్, మోనా సింగ్, సుహాస్ జోషి, తరణ్ జ్యోతి సింగ్, అజయ్ పుర్కర్, ఆయుష్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..