AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lal Salaam Movie: ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోన్న రజినీకాంత్ సినిమా.. ‘లాల్ సలామ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కోలీవుడ్ హీరోస్ విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా.. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.30 కోట్ల కంటే తక్కువే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ సినిమా నిర్మాతలకు భారీగానే నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాలో రజినీ అతిథి పాత్ర చేయడంతో విడుదలకు ముందే మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

Lal Salaam Movie: ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోన్న రజినీకాంత్ సినిమా.. 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Lal Salaam
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2024 | 1:21 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన చిత్రం లాల్ సలామ్. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో కోలీవుడ్ హీరోస్ విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా.. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.30 కోట్ల కంటే తక్కువే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ సినిమా నిర్మాతలకు భారీగానే నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాలో రజినీ అతిథి పాత్ర చేయడంతో విడుదలకు ముందే మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ స్టోరీ బోరింగ్.. సాగదీత ఉండడం.. అలాగే రజినీ పాత్రను స్క్రీన్ పై పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో ఐశ్వర్య విఫలమయ్యారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఈ మూవీలో రజినీ పాత్ర ఐదు నిమిషాలు మాత్రమే ఉండాల్సింది.. కానీ హైప్ కోసం తలైవా పాత్రను సాగదీయడం.. అనవసరపు సీన్స్ పెంచడంతో సినిమాపై అడియన్స్ పెదవి విరిచారు.

ఈ సినిమా థియేటర్లలలో విడుదలైన ఏడు నెలలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తోపాటు సన్ నెక్ట్స్ కూడా సొంతం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో లాల్ సలామ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన రానుంది. అయితే నెట్ ఫ్లిక్స్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. దర్శకురాలిగా లాల్ సలామ్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ధనుష్ నటించిన త్రీ, వాయ్ రాజా వాయ్ చిత్రాలను డైరెక్ట్ చేసింది. ప్రస్తుతం రజినీకాంత్ వెట్టైయాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 10న అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.