AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మెంటలెక్కించే ట్విస్టులు.. టెన్షన్ పుట్టించే సస్పెన్స్.. క్లైమాక్ అస్సలు ఊహించలేరు.. ఎక్కడ చూడొచ్చంటే..

ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వంటి సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. ఒక హీరోయిన్.. 7 ఎపిసోడ్స్.. అనుక్షణం మెంటలెక్కించే ట్విస్టులు.. క్షణక్షణం భయం పుట్టించే సస్పెన్స్ ఉండే ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం మీరు అసలు ఊహించలేరు. ప్రస్తుతం IMDb రేటింగ్ అద్భుతంగా ఉంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: మెంటలెక్కించే ట్విస్టులు.. టెన్షన్ పుట్టించే సస్పెన్స్.. క్లైమాక్ అస్సలు ఊహించలేరు.. ఎక్కడ చూడొచ్చంటే..
November Story Web Series
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2025 | 6:53 AM

Share

థ్రిల్లింగ్ క్రైమ్ కథలు, ఊహించని మలుపులు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు మీకు ఆసక్తి ఉంటుందా.. ? అయితే ఈ వెబ్ సిరీస్ (క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) మీ కోసమే. ప్రస్తుతం 7.6 IMDb రేటింగ్‌తో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ థ్రిల్లర్‌లలో ఒకటి. కథ మొదలైనప్పటి నుంచి క్షణక్షణం భయంగా.. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ కథలోని హంతకుడు చాలా తెలివైనవాడు. ఈ సిరీస్ మిమ్మల్నీ ఆద్యంతం కట్టిపడేస్తుంది. తదుపరి సన్నివేశంలో జరిగే ట్విస్టుల కోసం మీరు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సిరీస్ పేరు ‘నవంబర్ స్టోరీ’. ఇది ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మొత్తం 7 ఎపిసోడ్‌లు, చాలా ఆసక్తికరమైన కథను కలి ఉన్న ఈ సిరీస్ నిడివి దాదాపు 30-52 నిమిషాల మధ్య ఉంటుంది. దీనికి ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. తమిళంతోపాటు తెలుగులోకి కూడాఈ సిరీస్ డబ్ చేశారు. ఇది 2021లో విడుదలైంది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన తమన్నా భాటియా ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ లో ఆమె అనురాధ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె తండ్రి పాత్రను జె.ఎం. కుమార్ పోషించారు. శవ పరీక్ష వైద్యుడు అయిన కుజుధై యేసు పాత్రను పసుపతి పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. అన్ను (తమన్నా భాటియా) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు ప్రసిద్ధ క్రైమ్ నవల రచయిత అయిన ఆమె తండ్రి గణేషన్ (జిఎం కుమార్) అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంటాడు. ఒక రోజు గణేషన్ హత్య జరిగిన ప్రదేశంలో రక్తంతో తడిసిపోయి, ఏమీ గుర్తులేకుండా కనిపిస్తాడు. ఇదే సీన్ కథలో ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఈ ఊహించని సంఘటన అన్ను జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. తన తండ్రి నిర్దోషిగా నిరూపించడానికి ఆమె ఎలాంటి పోరాటం చేస్తుంది అనేది సినిమా.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించగానే అన్నూ కూడా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె తన తండ్రి గతాన్ని తెలుసుకుంటుంది. కానీ అదే సమయంలో మరిన్ని ప్రమాదకరమైన రహస్యాలను కనుగొంటుంది. ప్రతి ఎపిసోడ్‌తో, రహస్యం మరింత క్లిష్టంగా మారుతుంది. ఒక్కో ఎపిసోడ్ భావోద్వేగ నాటకాన్ని, మరోవైపు హత్య రహస్యం టెన్షన్ కలిగి ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ పూర్తిగా ఊహించని పజిల్. తన తండ్రి కోసం ఎంత దూరం అయినా వెళ్ళే కూతురిగా తమన్నా అద్భుతమైన, హృదయపూర్వక నటనతో కట్టిపడేసింది. జిఎం కుమార్ అల్జీమర్స్ సమస్యను చాలా సహజంగా, వాస్తవికంగా చిత్రీకరిస్తాడు. ‘నవంబర్ స్టోరీ’ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందులోబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..