Kaatera OTT: కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాటేరా’ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం కాటేరా. ప్రభాస్ నటించిన సలార్ పోటీని తట్టుకుని మరీ రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు చేసిందీ సినిమా. ఇందులో దర్శన్ హీరోగా నటించాడు. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ కాటేరా సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది
కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం కాటేరా. ప్రభాస్ నటించిన సలార్ పోటీని తట్టుకుని మరీ రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు చేసిందీ సినిమా. ఇందులో దర్శన్ హీరోగా నటించాడు. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ కాటేరా సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది. అలాగే టాలీవుడ్ ప్రముఖ నటులు జగపతిబాబు, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో మెరిశారు. థియేటర్లలోనూ సూపర్ హిట్ గా నిలిచిన కాటేరా ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 దర్శన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఒరిజినల్ కన్నడ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే తెలుగుతో పాటు తమిళ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది జీ5. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. కాగా థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత కాటేరా తెలుగు వెర్షన్ ను ఓటీటీలోకి తీసుకు రావడం గమనార్హం.
1970 విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తరుణ్ సుధీర్ కాటేరా సినిమాను తెరకెక్కించాడు. సుమారు నలభై ఐదు కోట్ల బడ్జెట్‌తో రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాక్‌లైన్ వెంకటేష్ ఈ మాస్ యాక్షన్ సినిమా ను నిర్మించాడు. కుమార్ గోవింద్, శ్రుతి, అచ్యుత్ కుమార్, ధనిష్ అక్తర్ , పద్మ వసంతి, శ్రీనివాస మూర్తి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. వి. హరికృష్ణ స్వరాలు సమకూర్చారు. సుధాకర్ ఎస్. రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కే.ఎమ్. ప్రకాశ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. మంచి మాస్ మసాలా సినిమాలు చూడాలనుకునేవారికి కాటేరా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్..
#Darshan‘s Recent Blockbuster #Kaatera now streaming in Telugu on #ZEE5 #KaateraOnZEE5 #DBoss @DBossTrends pic.twitter.com/B0HgsnaqS3
— ᴛ ʜ ᴇ 〲𝐃𝐄𝐕𝐈𝐋 𝕏 (@BabuRoberrt) April 14, 2024
తెలుగు, తమిళ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి..
2023 HGOTY at Karnataka Box office – Industry Hit #Kaatera now streaming in Telugu on #ZEE5 #KaateraOnZEE5 @dasadarshan #DBoss #BossOfSandalwood pic.twitter.com/eiHHKfIUWs
— 𝒀𝒂𝒔𝒉𝒂𝒔𝒘𝒊𝒏𝒊🐯 (@LadyTiger9999) April 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.