Family Star : ఫ్యామిలీ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే..
డుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ అంతగా ఆడలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ పై నిత్యం ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డే ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే ప్రకటన రానుందంటూ ప్రచారం నడుస్తుంది.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అటు బాగానే వసూళ్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియాలో కొందరు అటాక్ చేయడంతో కలెక్షన్స్ అనుకున్నంత స్థాయిలో రాబ్టలేకపోయింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ అంతగా ఆడలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ పై నిత్యం ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డే ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే ప్రకటన రానుందంటూ ప్రచారం నడుస్తుంది.
ఈ క్రమంలో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ పై మరో కొత్త రూమర్ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 3వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. గతంలో డైరెక్టర్ పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఇదే కావడంతో విడుదలకు ముందే ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. అలాగే అంతకు ముందే డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించిన ఖుషి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సమంత కథానాయికగా నటించింది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ పై మృణాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఇందు పాత్రలో కనిపించిన స్టిల్స్ షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఇందుగా కనిపించిన క్షణాలు.. ఇందుగా ఉన్న క్షణాలు.. తెరపై తాను చేసే ప్రతి పాత్ర ఎప్పటికీ తన గుండెల్లో ఉంటుందని.. ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటానని తెలిపింది. ప్రతి పాత్రను అక్కడే వదిలేయాలని అనుకోలేదని.. ఇందు పాత్రను చాలా ఆనందించానంటూ ఫ్యామిలీ స్టార్ ఫోటోస్ షేర్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.