Bigg Boss OTT Nominations: బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఇక గొడవలు స్టార్ట్.. నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే..
బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్ నాన్ స్టాప్
బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. గత నెల 26న ప్రారంభమైన ఈ షోలోకి గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వారియర్స్‌గా.. కొత్తవారు చాలెంజర్స్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తొలివారం నామినేషన్స్ రచ్చ బాగానే సాగింది. ముందుగా యాంకర్ శివతో నామినేషన్ ప్రక్రియ షురూ అయ్యింది. మొదటి శివ… సరయును నామినేట్ చేశాడు. తనతో సరిగ్గా మాట్లాడకపోవడవం వలన ఆమెను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు యాంకర్ శివ. ఇక ఆ తర్వాత.. ముమైత్ ఖాన్ ను నామినేట్ చేశాడు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వలన నాపై సీరియస్ కావడం నచ్చడం లేదంటూ చెప్పాడు శివ.
ఇక ఆ తర్వాత.. అరియానాను నామినేట్ చేసింది మిశ్రా. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది మిశ్రా శర్మ. తర్వాత వచ్చిన ఆర్జే చైతూ.. హామిదాను నామినేట్ చేశాడు. ఆమెతో వైబ్ రావడం లేదంటూ కారణం చెప్పాడు. రెండవ నామినేషన్ నటరాజ్ మాస్టర్ ను చేశాడు. నేను తింటుంటే.. చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. నేను రైస్ పెట్టుకున్నా.. ఎగ్స్ ఎక్స్ ట్రా తీసుకున్నా.. ఆయన ఫీల్ అవుతున్నారు. బాడీ షేమింగ్ చేయడం తనకు నచ్చలేదని చెప్పాడు ఆర్జే.
అజయ్ నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సరయుని నామినేట్ చేశాడు. ఇక అనంతరం శ్రీరాపాక అరియానను నామినేట్ చేస్తూ.. ఓవర్ కాన్ఫిడెన్స్ నచ్చలేదని చెప్పింది. రెండో నామినేషన్స్ ముమైత్ ను నామినేట్ చేసింది. తర్వాత అనీల్ రాథోడ్.. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య రచ్చ జరిగింది. మీరు ఎన్ని చేసిన జనాలు కాపాడతారు..అప్పుడు నేను మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. రెండో నామినేషన్ సరయుని నామినేట్ చేశాడు. ఆ తర్వాత బిందు మాధవి.. అఖిల్ ను.. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేసింది. యాంకర్ స్రవంతి.. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేసింది.
మొత్తంగా తొలివారానికి నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్, హమీదా, అరియానా, మిత్రా శర్మ, ఆర్జే చైతులు నామినేట్ అయ్యారు.
Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..
Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.