Naga Chaitanya: వెబ్‌సిరీస్‌తో భయపెట్టేందుకు సిద్ధమైన చైతూ.. టైటిల్ ఏంటంటే..
అక్కినేని అందగాడు నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గతేడాది చివరిలో లవ్‌స్టోరీతో డీసెంట్ హిట్ అందుకున్న చైతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగర్రాజుతో మరో హిట్ అందుకున్నాడు.
అక్కినేని అందగాడు నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గతేడాది చివరిలో లవ్‌స్టోరీతో డీసెంట్ హిట్ అందుకున్న చైతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగర్రాజుతో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం’ మనం’ ఫేం విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంది. మరోపక్క హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే వెండితెరతో పాటు డిజిటల్ తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతున్నాడీ అక్కినేని హీరో. ఇందులో భాగంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) రూపొందిస్తోన్న ఓ వెబ్‌సిరీస్‌కు కూడా పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
‘థ్యాంక్యూ’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విక్రమ్ కె కుమారే ఈ సిరీస్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు ‘దూత’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు నాగ చైతన్య. ఇందులో బ్లాక్ అండ్ వైట్ లో చైతూ వెనుక ఉన్న స్క్రిప్ట్ ని చూపిస్తూ విక్రమ్ కె కుమార్.. దూత స్టార్ట్స్ అని తెలిపారు. ఈ లుక్‌లో నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నాడు. కాగా ఇప్పటివరకు లవ్, ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన చైతూ తొలిసారిగా హర్రర్ జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. దూతతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరిఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను చైతూ ఎంతవరకూ భయపెడతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ..
View this post on Instagram
Also Read:IPL 2022: షాకిచ్చిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. అయోమయంలో గుజరాత్.. హార్దిక్ ముందు 4 ఎంపికలు!