AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: చై తో విడాకుల అనంతరం ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha: టాలీవుడ్(Tollywood) లో మోస్ట్ లవబుల్ పెయిర్(Lovable Pair) గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సమంతలు హఠాత్తుగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పినట్లు..

Samantha: చై తో విడాకుల అనంతరం 'అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను' అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్..
Samantha New Post
Surya Kala
|

Updated on: Mar 02, 2022 | 12:41 PM

Share

Samantha: టాలీవుడ్(Tollywood) లో మోస్ట్ లవబుల్ పెయిర్(Lovable Pair) గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సమంతలు హఠాత్తుగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పినట్లు ప్రకటించి.. అభిమానులతో పాటు.. అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తాజాగా సమంత.. తాను నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది.

సమంత రుత్ ప్రభు, నాగ చైతన్య లు వివాహ బంధానికి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత గుడ్ బై చెప్పారు.. నాల్గవ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ మాజీ జంట తాము విడాకులు తీసుకున్నామని బహిరంగ ప్రకటన  చేసారు. 2010లో సమంత తొలి చిత్రం ఏ మాయ చేసావే లో చైతన్యతో కలిసి నటించింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ముద్దుగా అభిమానులు చై సామ్ అని పిలుచుకునేవారు. కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం.. పెళ్లి చేసుకున్నారు. అభిమానులు .. చై, సామ్ లు విడిపోవడాన్ని మొదట జీర్ణించుకోలేదు. కొందరు ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియా వేదికగా సమంత, చైతన్యలపై  తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ముఖ్యంగా సమంత విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది.

చైతన్య నుండి విడిపోయినప్పటి నుండి.. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన ఫీలింగ్స్ ను తెలియజేస్తూ.. తనకు తాను శక్తిని పొందే విధమైన సందేశాత్మక పోస్టులను చేస్తూనే ఉంది. తాజా మంగళవారం.. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సద్గురు వీడియోను షేర్ చేసింది. ఆ స్టోరీస్ లో సద్గురు.. “మీరు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ అనుభవాన్ని జీవితంలో ముందుకు వెళ్ళడానికి .. మంచి మనిషిగా జీవించడానికి   ఉపయోగించుకోవచ్చు అని చెప్పిన మాటలున్నాయి.

సమంతా 2022 నుండి తనకు జీవితంపై పెద్దగా “అంచనాలేవీ” లేవని.. నాలుగేళ్లుగా తన భర్త నాగ చైతన్యతో ఇటీవల విడిపోయిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. తాను తరచుగా ఎదుర్కొనే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మాట్లాడింది. ఆమె విడిపోయిన నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక బాధను పంచుకుంది.  “2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనతో నాకు ఎలాంటి అంచనాలు లేవు.. ఎందులకంటే నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ శిథిలమయ్యాయి.. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏదైతే భద్రంగా ఉంటుందో దానిని స్వీకరిస్తాను.. దానికోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని సమంత తెలిపింది.

Also Read: భర్తను కోల్పోయిన తల్లి జీవితంలో కొత్త వెలుగులు.. గుండెను పిండేస్తున్న తనయుడి ఎమోషనల్ పోస్ట్