Viral News: భర్తను కోల్పోయిన తల్లి జీవితంలో కొత్త వెలుగులు.. గుండెను పిండేస్తున్న తనయుడి ఎమోషనల్ పోస్ట్

Viral News: మన సమాజంలో సంప్రదాయంలో భార్యను పోగొట్టుకున్న తొంబై ఏళ్ల వృద్ధుడు కూడా రెండో పెళ్లి చేసుకోవచ్చు.. దీనిని సమాజం హర్షిస్తుంది. అయితే యుక్త వయసులో భర్తని పోగొట్టుకున్న భార్య మాత్రం రెండో పెళ్లి..

Viral News: భర్తను కోల్పోయిన తల్లి జీవితంలో కొత్త వెలుగులు.. గుండెను పిండేస్తున్న తనయుడి ఎమోషనల్ పోస్ట్
Woman Married A Second Time
Follow us
Surya Kala

|

Updated on: Mar 02, 2022 | 12:18 PM

Viral News: మన సమాజంలో సంప్రదాయంలో భార్యను పోగొట్టుకున్న తొంబై ఏళ్ల వృద్ధుడు కూడా రెండో పెళ్లి చేసుకోవచ్చు.. దీనిని సమాజం హర్షిస్తుంది. అయితే యుక్త వయసులో భర్తని పోగొట్టుకున్న భార్య మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి ఇంకా కొంతమంది అంగీకరించడంలేదు… అయితే కాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా పిల్లల ఆలోచనలో మార్పులు వస్తున్నాయనడానికి ఉదాహరణగా ఈ పెళ్లి నిలుస్తుంది. అంతేకాదు.. వయస్సు, సమాజం, సంప్రదాయాలతో సంబంధం లేకుండా తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. భర్త చనిపోయి బ్రెస్ట్ క్యాన్సర్ తో   (Cancer) తో పోరాడి గెలిచిన ఓ  52 ఏళ్ల మహిళ .. మళ్ళీ ప్రేమించి.. జీవితాంతం తోడుగా ఓ వ్యక్తి కావాలంటూ మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి.. ఆ మహిళకు సంబంధించిన కథనాన్ని దుబాయ్‌(Dubai)లో స్థిరపడిన ఆమె కుమారుడు జిమీత్ గాంధీ(Jimeet Gandhi) ఒక వారం క్రితం  లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. ఈ పోస్టుకు 73,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

జిమీత్ తన పోస్ట్‌లో మొదటి లైన్‌లో తన తల్లి కామినీ గాంధీని పరిచయం చేస్తూ.. ఆమె కేవలం 44 సంవత్సరాల వయస్సులో 2013లో తన భర్తను కోల్పోయింది”.  2019లో తన తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అదీ  స్టేజ్ 3లో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో తన తల్లి క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ.. అనేకసార్లు కీమో సెషన్‌లు చేయించుకుంది. అలా ప్రాణాల కోసం రెండేళ్లు పోరాడి గెలిచిందని చెప్పారు.

ఓ వైపు తన తల్లి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే  కోవిడ్ -19 .. డెల్టా వేరియంట్‌ బారిన పడింది. అప్పుడు చాలా ఆందోళన నెలకొంది. అంతేకాదు.. ఇక జీవితం మీద ఆశవదిలేసుకునేటంత నిరాశ నెలకొంది. ఎందుకంటే పిల్లలు ఉద్యోగ రీత్యా వేరేవేరే ప్రాంతాల్లో ఉన్నాము.. దీంతో తన తల్లి ఎక్కువ కాలం ఒంటరిగా భారత దేశంలోనే జీవించింది.  అయితే, 52 ఏళ్ల తన తల్లి సంకల్పం, మానసిక దృఢత్వం ముందు.. క్యాన్సర్, కరోనా, ఒంటరి తనం ఇవేవీ పనిచేయలేదు.. అన్నింటిని జయించి ఈరోజు జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇదే సమయంలో తనకు ఓ తోడు కావాలని కోరుకుంది. ఓ వ్యక్తిని ప్రేమించింది. భారతీయ సమాజంలోని అన్ని అడ్డంకులను, ఆచారాల పేరుతో  ఉన్న అన్ని నిషేధాలను దాటుకుని తాను ప్రేమించిన వారిని వివాహం చేసుకుందని .. జిమిత్ ఆ పోస్ట్‌లో పంచుకున్నాడు. అంతేకాదు జీవిత భాగస్వామిని కోల్పోయిన ఒంటరి తల్లిదండ్రులకు ప్రేమ, సాంగత్యం అందించేలా పిల్లలలు తమ మద్దతు తెలిపాలని ఇతరులకు సలహాలు ఇస్తున్నాడు.

జిమీత్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ తన తల్లి..  తనతో తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పడానికి మొదట చాలా  సంకోచించిందని.. ముందుగా తన భార్యకు చెప్పిందనన్నాడు. అయితే తన తల్లి విషయం తెలుసుకున్న తాను ఆమె నిర్ణయాన్ని సమర్థించానని చెప్పాడు. ఈ జంట ఫిబ్రవరి 14న ముంబైలో వివాహం చేసుకున్నారు. “ కుటుంబ స్నేహితుడైన కిరిత్ పాడియాను మా అమ్మ వివాహం చేసుకుంది. అతను నిజంగా ప్రేమించే వ్యక్తి . అంతేకాదు వారి ప్రేమ చాలా నిస్వార్థమైనది. నేను నా తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉన్నాను. వారి ఇద్దరి నిర్ణయం.. పెళ్లి.. తనకు సంతోషాన్ని ఇచ్చిందని.. తన తల్లివైవాహిక జీవితం సుఖంగా సాగిపోవాలని కోరుకుంటున్నానని జిమీత్  హిందుస్థాన్ టైమ్స్‌తో తెలిపారు.

ఈ వైరల్ పోస్ట్‌కి నెటిజన్ల నుండి అనేక అద్భుతమైన కామెంట్స్ వచ్చాయి. మనమందరం విద్యావంతులం.. ఉన్నతంగా  ఆలోచించాలి. ప్రేమ, ఆనందంతో జీవించడం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు, ”అని లింక్డ్‌ఇన్ వినియోగదారులు  వ్యాఖ్యానించారు.

“నేను చాలా కాలం తర్వాత చదివిన అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన పోస్ట్‌లలో ఇది ఒకటి.  కొత్త జీవితాన్ని ప్రారంభించిన అమ్మకు అభినందనలు! మీలో ఇంత ఉన్నతమైన  భావాలను, నైతిక విలువలను పెంపొందించిన మీ అమ్మగారు తప్పక అద్భుతమైన మహిళ అయి ఉండాలి.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాకు నిజంగా మీ కుటుంబం లాంటి వ్యక్తులు కావాలి, ”అని మరొకరు కామెంట్ చేశారు.

Also Read:

కరోనా ప్రభావాన్ని తగ్గించే వేప.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ.. తాజా అధ్యయనంలో వెల్లడి..!

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో