పండుగపూట విషాదం.. చెట్టును ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి
మహాశివరాత్రి పర్వదినం రోజే.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు కారులో పయనమైన వారు.. తిరుగు ప్రయాణంలో ఊహించని ప్రమాదంలో దుర్మరణం(Died in accident) పొందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం...
మహాశివరాత్రి పర్వదినం రోజే.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు కారులో పయనమైన వారు.. తిరుగు ప్రయాణంలో ఊహించని ప్రమాదంలో దుర్మరణం(Died in accident) పొందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాకు చెందిన వారు.. మహాశివరాత్రి సందర్భగా ఒడిశా(Odisha) లోని నృసింఘనాథ్ దేవాలయాన్ని దర్శించుకునేందుకు పయనమయ్యారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
ఆనందంగా ఇంటికి వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం.. ఒడిశా లోని నౌపడ జిల్లా సదార్ బ్లాక్ సునీసియా ప్రాంతంలో అదుపు తప్పింది. వాన డ్రైవర్ కారును నియంత్రించలేకపోయాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు.. చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు నుంచి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.
Also Read
Maha Shivratri 2022: హర హర మహాదేవ శంభోశంకర.. శివనామస్మరణలు.. ప్రతీ చోటా శివరాత్రి శోభ..