Hey Sinamika: మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్న ‘హే సినామిక’ ప్రి రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా రానున్న అక్కినేని హీరో..
Naga Chaitanya: ఆమీర్ ఖాన్ ‘పీకే’, విజయ్ ‘తేరీ’ (తెలుగులో పోలీసోడు) తదితర హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన బృందా మాస్టర్ మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్నారు.
Naga Chaitanya: ఆమీర్ ఖాన్ ‘పీకే’, విజయ్ ‘తేరీ’ (తెలుగులో పోలీసోడు) తదితర హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన బృందా మాస్టర్ మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. మొదటి ఛాన్స్ లోనే ఏకంగా మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)ను డైరెక్షన్ చేసే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరే ‘హే సినామిక(Hey Sinamika)’. కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ లాంటి స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 3న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ వేడుక జరగనుంది.
అప్పుడు నాగార్జున.. ఇప్పుడు నాగచైతన్య.. కాగా గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘హే సినామిక’ సినిమా మొదటి పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగే ఈ సినిమా వేడుకకు మరో అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా ప్రేమ, స్నేహం..నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్ ఇంజినీర్ పాత్రలో కనిపించనుండగా, అతని సతీమణి పాత్రలో అదితిరావు హైదరీ నటిస్తోంది. మరి వీరిద్దరి మధ్యలో కాజల్ ఎందుకు ఎంటరైంది? తర్వాత దుల్కర్ జీవితం ఎలా మారిపోయిందనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. జియో స్టూడియోస్ తెరకెక్కించిన ఈ సినిమాకు గోవింద్ వసంతం బాణీలు సమకూర్చారు.
Also Read:Sea Creatures: ఈ జీవులు చాలా డేంజర్ గురూ.. మనిషిని కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు..!
Zodiac Sign: ఈ 4 రాశులవారు పెద్ద పిసినారులు.. కానీ ఈ విషయంలో మాత్రం ఫస్ట్..!