Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Sign: ఈ 4 రాశులవారు పెద్ద పిసినారులు.. కానీ ఈ విషయంలో మాత్రం ఫస్ట్..!

Zodiac Sign: ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం కోసం రాత్రిపగళ్లు కష్టపడుతారు. కానీ పొదుపు చేయడంలో మాత్రం విఫలమవుతారు. అందుకే డబ్బు సంపాదించడం గొప్పకాదు

Zodiac Sign: ఈ 4 రాశులవారు పెద్ద పిసినారులు.. కానీ ఈ విషయంలో మాత్రం ఫస్ట్..!
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 7:19 PM

Zodiac Sign: ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం కోసం రాత్రిపగళ్లు కష్టపడుతారు. కానీ పొదుపు చేయడంలో మాత్రం విఫలమవుతారు. అందుకే డబ్బు సంపాదించడం గొప్పకాదు వాటిని సేవ్‌ చేయడం ముఖ్యమని చెబుతారు. జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదన కోసమే పనిచేస్తారు. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత విలువ ఉంటుంది. కానీ కొంతమంది ఎంత సంపాదిస్తారో అంతే మొత్తం ఖర్చు పెడుతారు. అంతేకాదు నెల చివరికి ఎవరో ఒకరి దగ్గర చేయి చాచక తప్పదు. మరికొంతమంది ప్రాణం పోయినా పైస ఖర్చ పెట్టరు. ఇంకొంతమంది సమయం, సందర్భాన్ని బట్టి డబ్బులు ఖర్చు చేస్తారు. వీరు ఎప్పుడైనా ఉన్నత స్థితిలో ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు రాశుల వారు పిసినారులని చెబుతారు. డబ్బు పొదుపు చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అంటారు. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మకర రాశి

మకర రాశి వారు చాలా శ్రమిస్తారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి మనీ సంపాదిస్తారు. సరైన సందర్భంలో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఎందుకంటే ఈ విషయంలో వీరికి మంచి పట్టు ఉంటుంది. పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. దినం దినం అభివృద్ధి చెందుతారు.

మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేష రాశి వారు చాలా తెలివైనవారు. వీరి ఆలోచనలని అందుకోవడం అంత సులువు కాదు. వీలైనంత ఎక్కువ డబ్బును కూడబెడుతారు. ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాలను వెతుకుతారు. పెట్టబడులు ఆర్థిక వృద్దికి దోహదపడుతాయని నమ్ముతారు. అయినా కూడా వీరు సాధారణ జీవితాన్నే గడపటం విశేషం. వీరు జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటారు.

కన్య రాశి

కన్య రాశి వారు పొదుపు చేయడంలో ముందుంటారు. డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమొచ్చినా సరే తెలివిగా జారుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణని కచ్చితంగా పాటిస్తారు. అవసరం లేని పనులకు డబ్బును అస్సలు ఖర్చు చేయరు. పెట్టుబడులు పెట్టడంలో ముందువరుసలో ఉంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు చాలా పొదుపరులు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉంటారు. పైసా ఖర్చు పెట్టేముందు వెయ్యి సార్లు ఆలోచిస్తారు. వృథా ఖర్చుల జోలికి అస్సలు వెళ్లరు. ముఖ్యమైన పనులకు మాత్రమే జేబుల్లో నుంచి డబ్బు తీస్తారు. అందుకే వీరిని అందరు పిసినారులని పిలుస్తారు.

Cholesterol: శరీరంలో కొవ్వు పెరగకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!

Peepal Tree: రావిచెట్టుని పూజిస్తే అద్భుత ఫలితాలు.. ఆ బాధలన్నింటికి చక్కటి పరిష్కారం..