Maha Shivaratri: హర హర మహాదేవ శంభో శంకర.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

Maha Shivaratri 2022: అటు దేశ వ్యాప్తంగా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి..

Maha Shivaratri: హర హర మహాదేవ శంభో శంకర.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
Maha Shivaratri
Follow us
Janardhan Veluru

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 8:04 PM

Maha Shivaratri 2022: అటు దేశ వ్యాప్తంగా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారు జాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర.. శివోహం.. శివోహం.. అన్ని ఆలయాల్లో శివరాత్రి శోభ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని జ్యోతిర్లింగ, త్రిలింగ క్షేమాలు, పంచారామాలు, శక్తి పీఠాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి.. తెల్లవారు జాము నుంచే ఆలయాలకు భక్తులు పోతెత్తారు.

  1. మహాశివరాత్రి వేళ జ్యోతిర్లింగ క్షేత్రం, ఆష్టాదశ పీఠం కొలువైన శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. మల్లికార్జున స్వామితో పాటు, భమరాంబికా దేవిని దర్శించుకోవడాని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.. తెల్లవారుజామునుంచే బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, భస్మాభిషేకాలు నిర్వహించారు. మల్లన్న బ్రహ్మోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
  2. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన సుప్రసిద్ధ కాళేశ్వరం మహాశివరాత్రి వేళ భక్తులతో పోటెత్తింది.. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీప దానాలు, గోదారమ్మ, సైకత లింగలకు పూజలు చేస్తున్నారు. ఆలయంకు చేరుకొని కాళేశ్వర-ముక్తీశ్వరా స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన లు చేస్తున్నారు.
  3. హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్ జిల్లా కీసరలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైభవంగా రుద్రాభిషేకం చేపట్టారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రామలింగేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
  4. తెలంగాణలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శివనామస్మరణతో మార్మోగుతోంది.. అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. వేములవాడ రాజన్నకు ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్… స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
  5. శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 2.30 నుంచి దర్శనం ప్రారంభమైంది. దాదాపు లక్షన్నర మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి ఉంటున్నారు. మరోవైపు వీఐపీల తాకిడితో 500 రూపాయల దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.
  6. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి.. అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు. సామర్లకోట పంచారామాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
  7. మహాశివరాత్రి వేళ దేశమంతా శివనామ స్మరణ వినిపించింది.. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తుల సందడితో కిటకిటలాడాయి.వారణాసిలోని పవిత్ర కాశీ విశ్వనాథేశ్వరుని క్షేత్రం శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తుల పరమశివుని దర్శన కోసం తరలి వచ్చారు.. గంగానది తీరం పవిత్ర స్నానాలతో రద్దీగా కనిపించింది. దైవ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు..
  8. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది ఉదయం నుంచే ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. హారతి, అభిషేకాలు చేపట్టారు. పరమశివునికి ‘భస్మ హారతి’ నిర్వహించారు.
  9. యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేతలు- శివరాత్రివేళ పూజలు చేశారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌మఠ్‌ మందిర్‌లో యూపీ సీఎం యోగి- రుద్రాభిషేకం చేశారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ-సిహారి అనే ప్రాంతంలో ఉన్న శివాలయానికి వెళ్లి అభిషేకం చేశారు.

Also Read..

Maha Shivratri 2022: మహా శివరాత్రి రోజున ఈ మంత్రాలను పఠించండి.. జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి..!

Russia Ukraine Crisis: పుతిన్‌కు షాకిచ్చిన వరల్డ్ టైక్వాండో.. బ్లాక్ బెల్ట్‌‌ వెనక్కు..