Russia Ukraine Crisis: పుతిన్‌కు షాకిచ్చిన వరల్డ్ టైక్వాండో.. బ్లాక్ బెల్ట్ వెనక్కు..
Russian President Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు మాస్కో బలగాలు ఖార్కివ్‌పై కాల్పులు జరుపుతూ 11 మంది పౌరులను హతమార్చిన సంగతి తెలిసిందే.
Russian President Vladimir Putin: ఉక్రెయిన్‌పై దాడి(Russia Ukraine Crisis)కి పాల్పడినందుకుగాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ టైక్వాండో బ్లాక్ బెల్ట్‌పై వేటు పడింది. ఈ మేరకు వరల్డ్ టైక్వాండో(World Taekwondo) ట్విటర్‌లో వ్లాదిమిర్ పుతిన్ నుంచి బ్లాక్ బెల్ట్‌ను వెనక్కుతీసుకున్నట్లు తెలిపింది. “విజయం కంటే శాంతి అత్యంత విలువైనది” అనే నినాదానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లో అమాయకుల జీవితాలపై జరిగిన క్రూరమైన దాడులను ప్రపంచ టైక్వాండో తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రీడల పాలకమండలి ఈ పోస్ట్‌లో పేర్కొంది.
“నవంబర్ 2013లో మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్‌కు 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను ప్రదానం చేశాం. ప్రస్తుతం ఈ యుద్ధంతో శాంతికి భంగం కలిగింది. దీంతో వరల్డ్ టైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను తొలగించింది” అని ఆ పోస్టులో పేర్కింది. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ, రష్యా, బెలారస్‌లో టైక్వాండో ఈవెంట్‌లను నిర్వహించడం లేదా గుర్తించడం లేదని కూడా వరల్డ్ టైక్వాండో పేర్కొంది. ఇప్పటికే ఫుట్‌బాల్, వాలీబాల్ ఈవెంట్లను రష్యా నుంచి తప్పించడం తెలిసిందే.
రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని రెండవ నగరం ఖార్కివ్‌పై షెల్లింగ్‌పై దాడులు కొనసాగించాయి. ఇందులో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఒలేగ్ సినెగుబోవ్ మాస్కో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టు, సెప్టెంబర్‌లలో పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు రష్యా ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ, ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో హోస్టింగ్ లిస్టు నుంచి రష్యాను తొలగించినట్లు అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) పాలకమండలి మంగళవారం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత గురువారం నుంచి ఉక్రెయిన్‌పై దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి మేం గమనిస్తునే ఉన్నాం. ఇలాంటి హింసాత్మక చర్యలకు బదులుకుగా రష్యాపై వేటు వేశామని తెలిపింది. “ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి తరువాత, ఉక్రెయిన్ ప్రజల భద్రత కోసం FIVB తీవ్రంగా ఆందోళన చెందుతోంది” అని అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.
“ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రష్యాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను సిద్ధం చేయడం, నిర్వహించడం అసాధ్యం అని FIVB బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధారణకు వచ్చింది” అని ప్రకటనలో పేర్కొంది. “తదనుగుణంగా 2022 ఆగస్టు, సెప్టెంబర్‌లలో జరగనున్న FIVB వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహణ నుంచి రష్యాను తొలగించాలని నిర్ణయించింది” అని పేర్కొంది.
అలాగే సెప్టెంబర్ 25న జరగాల్సిన రష్యన్ గ్రాండ్ ప్రిని కూడా శుక్రవారం ఫార్ములా వన్ రద్దు చేసింది. FIFA, UEFA సోమవారం రష్యాను అన్ని అంతర్జాతీయ పోటీల నుంచి తదుపరి నోటీసు వచ్చేవరకు సస్పెండ్ చేశాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో రష్యాపై కూడా నిషేధం విధించారు.
World Taekwondo strongly condemns the brutal attacks on innocent lives in Ukraine, which go against the World Taekwondo vision of “Peace is More Precious than Triumph” and the World Taekwondo values of respect and tolerance.#PeaceIsMorePreciousThanTriumphhttps://t.co/nVTdxDdl2I
— World Taekwondo (@worldtaekwondo) February 28, 2022