- Telugu News Photo Gallery Cricket photos Ind Vs SL 1st Test: Team India former skipper Virat Kohli 100th Test in mohali vs Sri Lanka Team india vs sri lanka records
IND vs SL: సచిన్‌కు సాధ్యం కాని ఆ స్పెషల్ రికార్డు.. 100వ టెస్టులో విరాట్ పూర్తి చేసేనా.. లిస్టులో ఎవరున్నారంటే?
మొహాలీలో శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్, టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli 100th Test)కి చాలా ప్రత్యేకమైనది. ప్రతి క్రికెటర్ కలలు కనే మొహాలీలో విరాట్ కోహ్లీ కల నెరవేరుతుంది. మొహాలీలో, విరాట్ కోహ్లీ తన 100వ టెస్ట్..
Updated on: Mar 01, 2022 | 4:16 PM

మొహాలీలో శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్, టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli 100th Test)కి చాలా ప్రత్యేకమైనది. ప్రతి క్రికెటర్ కలలు కనే మొహాలీలో విరాట్ కోహ్లీ కల నెరవేరుతుంది. మొహాలీలో, విరాట్ కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌ని మరింత ప్రత్యేకంగా చేసేందుకు ప్రయత్నిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తన 100వ టెస్టులో విరాట్ కోహ్లీ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. (PC-AFP)

విరాట్ కోహ్లి సెంచరీ చేయడం ద్వారా తన 100వ టెస్టును విజయవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. భారత చరిత్రలో ఏ క్రికెటర్ కూడా 100వ టెస్టులో సెంచరీ చేయలేకపోయాడు. మొత్తం 11 మంది భారత ఆటగాళ్లు 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రత్యేక జాబితాలో తన పేరును నమోదు చేయబోతున్నాడు. 100వ టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలుస్తాడో లేదో చూడాలి. (PC-AFP)

ఇప్పటి వరకు 9 మంది ఆటగాళ్లు 100వ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఘనతని సాధించారు. ముందుగా 1968లో ఇంగ్లండ్‌కు చెందిన కోలిన్ కౌడ్రీ 100వ టెస్టులో సెంచరీ సాధించాడు. వీరితో పాటు జావేద్ మియాందాద్, గోర్డాన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవర్ట్, ఇంజమామ్ ఉల్ హక్, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, జో రూట్ ఈ ఘనత సాధించిన తిస్టులో ఉన్నారు. (PC-AFP)

క్రికెట్ చరిత్రలో తన 100వ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రికీ పాంటింగ్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాంటింగ్ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లి నుంచి కూడా ఇలాంటి అరుదైన ఘనతనే ఫ్యాన్స్ ఆశిస్తు్న్నారు. (PC-AFP)

తన 100వ టెస్టులో విరాట్ కోహ్లీ 38 పరుగులు చేయడం ద్వారా తన 8000 టెస్టు పరుగులను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా నిలవనున్నాడు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, సెహ్వాగ్ ఈ సంఖ్యను అధిగమించారు. (PC-AFP)





























