Russia Ukraine War: రెడ్ కార్డ్ లిస్టులో చేరిన రష్యా.. వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2022 నుంచి ఔట్..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడి కారణంగా రష్యాపై ఆంక్షల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా FIFA, UEFA, IFVB ఈ లిస్టులో చేరిపోయాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు రష్యాను అన్ని అంతర్జాతీయ పోటీల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

Russia Ukraine War: రెడ్ కార్డ్ లిస్టులో చేరిన రష్యా.. వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2022 నుంచి ఔట్..
2022 Volleyball World Championships
Follow us

|

Updated on: Mar 01, 2022 | 4:57 PM

ఆగస్టు, సెప్టెంబర్‌లలో పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌‌(Volleyball World Championships)కు రష్యా ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ, ఉక్రెయిన్‌పై దాడి(Russia Ukraine War) చేయడంతో హోస్టింగ్ లిస్టు నుంచి రష్యాను తొలగించినట్లు అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) పాలకమండలి మంగళవారం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత గురువారం నుంచి ఉక్రెయిన్‌పై దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి మేం గమనిస్తునే ఉన్నాం. ఇలాంటి హింసాత్మక చర్యలకు బదులుకుగా రష్యాపై వేటు వేశామని తెలిపింది. “ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి తరువాత, ఉక్రెయిన్ ప్రజల భద్రత కోసం FIVB తీవ్రంగా ఆందోళన చెందుతోంది” అని అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.

“ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రష్యాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను సిద్ధం చేయడం, నిర్వహించడం అసాధ్యం అని FIVB బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధారణకు వచ్చింది” అని ప్రకటనలో పేర్కొంది. “తదనుగుణంగా 2022 ఆగస్టు, సెప్టెంబర్‌లలో జరగనున్న FIVB వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహణ నుంచి రష్యాను తొలగించాలని నిర్ణయించింది” అని పేర్కొంది.

అలాగే సెప్టెంబర్ 25న జరగాల్సిన రష్యన్ గ్రాండ్ ప్రిని కూడా శుక్రవారం ఫార్ములా వన్ రద్దు చేసింది. FIFA, UEFA సోమవారం రష్యాను అన్ని అంతర్జాతీయ పోటీల నుంచి తదుపరి నోటీసు వచ్చేవరకు సస్పెండ్ చేశాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో రష్యాపై కూడా నిషేధం విధించారు. ఇది మాత్రమే కాదు, యూరోపియన్ ఫుట్‌బాల్ పాలకమండలి రష్యా ఇంధన దిగ్గజం గాజ్‌ప్రోమ్‌తో భాగస్వామ్యాన్ని కూడా ముగించింది.

క్లబ్బులపై నిషేధం.. రష్యా జాతీయ జట్టుపైనే కాకుండా దాని క్లబ్ జట్లపై కూడా నిషేధం విధించింది. ఈ నిషేధం తర్వాత ప్రస్తుతం రష్యా ఏ క్లబ్ జట్టు కూడా UEFAకు సంబంధించిన ఏ పోటీలోనూ ఆడలేరు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పరిమితి అమల్లో ఉండనుంది.

మార్చి 24న ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్.. మార్చి 24న జరిగే వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో రష్యా పురుషుల జట్టు పోలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఇది కాకుండా రష్యా తదుపరి మ్యాచ్ స్వీడన్ లేదా చెక్ రిపబ్లిక్‌తో మార్చి 29న జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుత నిషేధం కారనంగా ఈ రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.

ఖండించిన రష్యా.. అదే సమయంలో, రష్యన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఈ సస్పెన్షన్ చర్యను ఖండించింది. ఈ చర్య “వివక్షతో కూడుకున్నది” అని పేర్కొంది. నిషేధం నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో అథ్లెట్లు, కోచ్‌లు, క్లబ్‌లు, జాతీయ జట్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.

Also Read: IND vs SL: సచిన్‌కు సాధ్యం కాని ఆ స్పెషల్ రికార్డు.. 100వ టెస్టులో విరాట్ పూర్తి చేసేనా.. లిస్టులో ఎవరున్నారంటే?

Russia Ukraine War: రష్యా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాం.. మా ఫ్యామిలీ అంతా సేఫ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్