Russia Ukraine War: రష్యా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాం.. మా ఫ్యామిలీ అంతా సేఫ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Kevin Pietersen: రష్యా దాడుల సమయంలో కెవిన్ పీటర్సన్ కుటుంబం ఉక్రెయిన్‌లో ఉంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం అందించాడు.

Russia Ukraine War: రష్యా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాం.. మా ఫ్యామిలీ అంతా సేఫ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Kevin Pietersen Family Escapes Ukraine Poland
Follow us

|

Updated on: Mar 01, 2022 | 2:56 PM

Kevin Pietersen: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ కుటుంబం ఉక్రెయిన్‌లో ఉండిపోయింది. రష్యా దండయాత్ర సమయంలో తన కుటుంబం ఉక్రెయిన్‌లో ఉందని, అయితే అతని భార్య, పిల్లలు ఎలాగో ఆ దేశం నుంచి వెళ్లిపోయారని పీటర్సన్ సోషల్ మీడియా(Social Media)లో తెలియజేశారు. రష్యా దాడి(Ukraine Russia War) సమయంలో పీటర్సన్ కుటుంబం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. అయితే వారు ఉద్రిక్త పరిస్థితుల్లో సరిహద్దు దాటి పోలాండ్ చేరుకోగలిగారు.

ఈ విషయాన్ని కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అదే సమయంలో తమ దేశంలో 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులకు ఆశ్రయం కల్పించిన పోలాండ్ ప్రభుత్వానికి పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపారు.

కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేస్తూ, ‘ఉక్రెయిన్ ప్రజలకు పోలాండ్ మంచి ప్రదేశం అని నేను చెప్పాలనుకుంటున్నాను. నా కుటుంబం కూడా ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలాండ్ వెళ్లిపోయింది. పోలాండ్‌కు ధన్యవాదాలు.

కెవిన్ పీటర్సన్ భార్య జెస్సికా పీటర్సన్ కూడా పోలాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జెస్సికా పీటర్సన్ ట్వీట్ చేస్తూ, ‘పోలాండ్ ప్రజలారా, మీరు మా కుటుంబానికి చూపిన స్వాగతానికి, దయకు మేం మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం’అని తెలిపింది.

ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. రష్యా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి. రష్యా చేస్తున్న ఈ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా, అనేక యూరోపియన్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా నిలిచాయి.

Also Read: Ranji Trophy 2022: మొన్న కూతురు.. ఆ తర్వాత తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే బరోడా క్రికెటర్..!

Pak vs Aus: ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. పాక్ పర్యటన నుంచి నీ భర్త తిరిగిరాడంటూ మెసేజ్‌లు..