AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup 2022: 8 దేశాలు.. 31 మ్యాచ్‌లు.. మార్చి 4నుంచే మహిళల సమరం.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ..

మహిళల ప్రపంచకప్‌2022కు న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఏప్రిల్ 3 వరకు టోర్నీ కొనసాగనుంది. ఇందులో 8 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు..

Women's World Cup 2022: 8 దేశాలు.. 31 మ్యాచ్‌లు.. మార్చి 4నుంచే మహిళల సమరం.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ..
Icc Women's World Cup 2022
Venkata Chari
|

Updated on: Mar 01, 2022 | 3:32 PM

Share

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022(women’s world cup 2022) న్యూజిలాండ్‌లో మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 దేశాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. తొలి మ్యాచ్ న్యూజిలాండ్(New Zealand), వెస్టిండీస్ మధ్య జరగనుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మార్చి 6న పాకిస్థాన్‌తో టీమిండియా(India Womens vs Pakistan Womens) తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈసారి జరిగే ఈ మెగా టోర్నీలో ఐసీసీ పలు మార్పులు చేసింది. మహిళల ప్రపంచకప్‌ 2022 టోర్నీ గురించి ప్రతి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

హోస్ట్ ఎవరు, ఎన్ని జట్లు పాల్గొంటాయి? మహిళల ప్రపంచకప్‌2022కు న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఏప్రిల్ 3 వరకు టోర్నీ కొనసాగనుంది. ఇందులో 8 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు ఈ మెగా టోర్నీలో తలపడనున్నాయి. ఫైనల్‌తో సహా మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 6న పాకిస్థాన్‌తో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్‌లో టీమిండియా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టీమిండియా ఆడే అన్ని మ్యాచ్‌లు డే-నైట్‌గా ఉన్నాయి. అయితే మ్యాచ్ న్యూజిలాండ్‌లో ఉన్నందున ఇవి భారత కాలమాన ప్రకారం ఉదయం 6.30 నుంచి భారతదేశంలో మ్యాచ్‌ను చూడొచ్చు.

టీమిండియా ఎన్నిసార్లు ప్రపంచకప్ గెలిచింది? మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు ఫైనల్‌కు చేరినా, టైటిల్ గెలవలేకపోయింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లండ్‌తో భారత్‌ ఓడిపోయింది. మహిళల ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు మూడు జట్లు గెలుచుకున్నాయి. ఈ టోర్నీని ఆస్ట్రేలియా అత్యధిక సార్లు గెలుచుకుంది. ఇంగ్లండ్ 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అదే సమయంలో, న్యూజిలాండ్ ఒకసారి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది.

మ్యాచులను ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి? స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మహిళల ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అదే సమయంలో, మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం హాట్‌స్టార్‌లోనూ ఉంటుంది.

పెరిగిన ప్రైజ్ మనీ.. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టుకు గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు రెట్టింపు ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈసారి ప్రపంచకప్ విజేత జట్టుకు 1.32 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) లభించనుంది.

9 మంది ఆటగాళ్ళతో బరిలోకి దిగొచ్చు.. కరోనా మహమ్మారి కారణంగా ICC మహిళల ప్రపంచ కప్ నియమాలలో కీలక మార్పు చేసింది. కొత్త నిబంధన ప్రకారం, ఒక జట్టులో ఎక్కువ కరోనా కేసులు నమోదైతే.. 11 మంది ఆటగాళ్లకు బదులు 9 మంది ఆటగాళ్లతో మైదానంలోకి వెళ్లవచ్చని పేర్కొంది.

Also Read: Russia Ukraine War: రష్యా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాం.. మా ఫ్యామిలీ అంతా సేఫ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Ranji Trophy 2022: మొన్న కూతురు.. ఆ తర్వాత తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే బరోడా క్రికెటర్..!