AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak vs Aus: ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. పాక్ పర్యటన నుంచి నీ భర్త తిరిగిరాడంటూ మెసేజ్‌లు..

Ashton Agar: 1998 తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. టెస్టు సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది.

Pak vs Aus: ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. పాక్ పర్యటన నుంచి నీ భర్త తిరిగిరాడంటూ మెసేజ్‌లు..
Pakistan Vs Australia
Venkata Chari
|

Updated on: Feb 28, 2022 | 6:41 PM

Share

పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు(Australia Cricket Team) ఆటగాడి భార్యకు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. పాకిస్థాన్‌ను సందర్శించకూడదని అందులో పేర్కొంటూ, లేదంటే హత్య చేస్తామంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి. ఆస్ట్రేలియన్ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. ఆస్ట్రేలియా చివరిసారిగా 1998లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ప్రస్తుత పర్యటన మార్చి 4న రావల్పిండిలో తొలి టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తల ప్రకారం, ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అష్టన్ అగర్ భార్య మాడెలైన్‌కు బెదిరింపు సందేశం పంపారు. ఈ విషయంపై వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు సమాచారం అందించారు. ఆస్ట్రేలియన్ జట్టు ప్రతినిధి ఎగ్గర్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. పాకిస్థాన్‌ పర్యటనకు వస్తే మీ భర్త అష్టన్ అగర్‌ను చంపేస్తామని, అతను ప్రాణాలతో తిరిగిరాడని ఆ మెసేజ్‌లో రాసి ఉంది.

టీమ్‌తో పాటు భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని విచారించగా, అది అంత సీరియస్‌గా లేదని భావిస్తున్నారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా భారత్‌తో ముడిపడి ఉందని చెబుతున్నారు.

ఆస్ట్రేలియా జట్టుకు పూర్తి భద్రత.. అగర్‌ మాట్లాడుతూ, తన భార్యకు వచ్చిన బెదిరింపు సందేశాల గురించి పెద్దగా చింతించలేదు. పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చాను’ అని తెలిపాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫిబ్రవరి 27న పాకిస్థాన్ చేరుకుంది. బృందానికి పూర్తి భద్రత కల్పించారు. హోటళ్లు, స్టేడియంలలో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. టీమ్ బస్సుతో పాటు కమాండోలు, పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి.

సన్నాహాలు ప్రారంభం.. టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు కూడా సన్నాహాలు ప్రారంభించింది. మార్చి 1న ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రాంభించనుంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ఈ సిరీస్‌లో ఆడేందుకు పూర్తి బలంలో బరిలోకి దిగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రధాన ఆటగాడు తన పేరును ఉపసంహరించుకోలేదు. టెస్టు సిరీస్ తర్వాత వన్డేలు, టీ20 మ్యాచ్‌లు కూడా ఆడనున్నాయి. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రావల్పిండి, లాహోర్, కరాచీలలో మాత్రమే జరుగుతాయి.

Also Read: Watch Video: ఈ క్యాచ్ ఓ ‘అద్భుతం’.. అలా ఎలా పట్టావయ్యా బాబు.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో

3 మ్యాచ్‌లు, 3 హాఫ్ సెంచరీలు, 204 పరుగులతో నాటౌట్.. అయినా భారత జట్టులో ప్లేస్‌పై నీలిమేఘాలే.. కారణం ఏంటంటే?