AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 మ్యాచ్‌లు, 3 హాఫ్ సెంచరీలు, 204 పరుగులతో నాటౌట్.. అయినా భారత జట్టులో ప్లేస్‌పై నీలిమేఘాలే.. కారణం ఏంటంటే?

IND VS SL: ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఏకపక్షంగా శ్రీలంకను ఓడించింది. మరోసారి శ్రేయాస్ అయ్యర్‌ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

3 మ్యాచ్‌లు, 3 హాఫ్ సెంచరీలు, 204 పరుగులతో నాటౌట్.. అయినా భారత జట్టులో ప్లేస్‌పై నీలిమేఘాలే.. కారణం ఏంటంటే?
Shreyas Iyer
Venkata Chari
|

Updated on: Feb 28, 2022 | 5:41 PM

Share

లక్నో టీ20లో 57 పరుగులతో నాటౌట్, ధర్మశాలలో జరిగిన రెండవ టీ20లో 74 పరుగులతో నాటౌట్, 3వ టీ20లోనూ 73 పరగులతో నాటౌట్.. ఇవి శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (India vs Sri Lanka, 3rd T20I) శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) సాధించిన సాటిలేని గణాంకాలు. శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ అర్ధ శతకాలతో అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో 204 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ ఈ ఇన్నింగ్స్‌లతో తనేంటో నిరూపించుకున్నాడు. వన్డే అయినా, టీ20, టెస్ట్ అయినా సరే.. ప్రతి ఫార్మాట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్‌ ప్లేయింగ్ XI నుంచి తొలగించడం అంత సులభం కాదని నిరూపించాడు. అయినా ఇప్పటికీ ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ నిరాశ చెందాల్సి రావడం గమనార్హం.

మూడు టీ20 మ్యాచ్‌లలో (India vs Sri Lanka) 204 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎందుకు నిరాశ చెందాల్సి వస్తుందని మీరు ఆలోచిస్తున్నారా? అవును, ఇంతమంచి ఫాంలో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కు జట్టులో ప్లేస్‌పై కన్మ్‌ఫాం కాకపోవడమే ఇందుకు కారణం. డిఫెన్స్ నుంచి ప్రమాదకర షాట్‌లతో ప్రత్యర్థులకు దడ పుట్టించే శ్రేయాస్ అయ్యర్.. ప్రమాదకరమైన టీ20 ఆటగాడిగా పేరుగాంచాడు. మరి ఇలాంటి ఈ ఆటగాడి నిరాశకు కారణం అతని బ్యాటింగ్ ఆర్డర్.

విరాట్ కోహ్లీ తిరిగి రాగానే అయ్యర్ బెంచ్‌కే పరిమితం.. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయాస్ అయ్యర్ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే బ్యాటింగ్ ఆర్డర్ ఇదే. విరాట్ కోహ్లీ తిరిగి వస్తే, శ్రేయాస్ అయ్యర్ నంబర్ 3ని ఖాళీ చేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రశ్న ఏమిటంటే, శ్రేయాస్ అయ్యర్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు? ఎందుకంటే టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కొత్త ప్లాన్ ప్రకారం, రిషబ్ పంత్ 4వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానంలో బరిలోకి దిగనున్నారు. 6, 7 నంబర్లలో వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉంటారు.

శ్రేయాస్ అయ్యర్ 3వ స్థానం ఖాళీ చేయాల్సిందేనా.. శ్రేయాస్ అయ్యర్ నంబర్ 3లో ఆడకపోతే, అతని ప్రత్యక్ష పోటీ సూర్యకుమార్ యాదవ్‌తో ఢీకొట్టాల్సి ఉంటుంది. సూర్యను టీమిండియా ప్లేయింగ్ XI నుంచి తప్పించే సాహసం చేయకపోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 14 టీ20 మ్యాచ్‌లలో తన బలమైన ప్రదర్శనతో ప్రతి సందర్భంలోనూ అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. సూర్యకుమార్ 39 సగటుతో 351 పరుగులు చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ 165కి పైగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో ఇంత స్ట్రైక్ రేట్ ఉండటం అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

శ్రేయాస్ అయ్యర్ రికార్డులు కూడా.. శ్రేయాస్ అయ్యర్ కూడా 36 టీ20 మ్యాచ్‌లలో 36.77 సగటుతో 809 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 140 మించి ఉంది. ఈ గణాంకాలు టీ20 క్రికెట్‌లో సాటిలేనివి అయితే ఇక్కడ లోపం అయ్యర్ గణాంకాలు లేదా ప్రదర్శనపై లేవు. అతని బ్యాటింగ్ ఆర్డర్‌పై ఉండడం గమనార్హం. శ్రేయాస్ అయ్యర్ ఎంతగానో రాణిస్తూ.. విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తాడని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కూడా అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్‌తో సంభాషణలో, పార్థివ్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లతో పోటీ పడినప్పుడు, అటువంటి ప్రదర్శనే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, పునరాగమనం తర్వాత, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఎక్కడ, ఏ నంబర్‌లో, ఏ మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇస్తుందనేది వారి చేతుల్లో లేదు. బహుశా శ్రేయాస్ అయ్యర్ కూడా అలాగే ఆలోచిస్తుండవచ్చు” అని పేర్కొన్నాడు.

Also Read: వారు కచ్చితంగా టీమిండియా అభిమానులు కాదు.. అలాంటి ఆలోచనలకు మందే లేదు: ట్రోలర్స్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు

IND vs SL: లంక సిరీస్‌లో సత్తా చాటిన ముగ్గురు భారత ఆటగాళ్లు.. టీ20 ప్రపంచ కప్‌లో ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ..