- Telugu News Photo Gallery Cricket photos IND vs SL: Shreyas Iyer, Ravindra Jadeja, Bhuvneshwar Kumar shine in Sri Lanka T20 Series
IND vs SL: లంక సిరీస్‌లో సత్తా చాటిన ముగ్గురు భారత ఆటగాళ్లు.. టీ20 ప్రపంచ కప్‌లో ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ..
అక్టోబరు-నవంబర్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో స్థానం కోసం చాలామంది భారత ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అవకాశం దక్కించుకుని, అద్భుతంగా రాణించి, సెలక్టర్ల కష్టాలను మరింతగా పెంచారు.
Updated on: Feb 28, 2022 | 4:04 PM

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ చాలా మంది భారత ఆటగాళ్లకు కీలక పరీక్షగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ చాలా కీలకమైంది. అయితే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా సమయం ఉంది. అయితే శ్రీలంకపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆటగాళ్లు, అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఆ ICC టోర్నమెంట్‌లో తమ వాదనను బలంగా వినిపించారు. జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ సిరీస్‌లో ఎవరు రాణించారు.. వారి ప్రదర్శనలను ఓసారి చూద్దాం. (ఫోటో AFP)

శ్రేయాస్ అయ్యర్: ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ టీ20 సిరీస్‌లోని 3 మ్యాచ్‌లలో 174.35 సగటుతో 204 పరుగులు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రేయాస్ ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. అజేయంగా 74 పరుగుల అత్యధిక స్కోరు కూడా సాధించాడు. అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంతో ఎలాంటి ప్రదర్శన చేశాడో ఈ రికార్డులు చూస్తేనే తెలుస్తోంది. దీంతో టీ20 ప్రపంచ కప్ 2022 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనడంలో సందేహం లేదు.(ఫోటో AFP)

రవీంద్ర జడేజా: గాయంతో గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. కొత్త సంవత్సరంలో తన తొలి సిరీస్‌ను ఆడుతున్నాడు. అయితే ఈ సిరీస్‌లో అద్భుతంగా పునరాగమనం చేసి, ఔరా అనిపించాడు. క్రికెట్‌కు దూరం కావడం ‘సర్జి’ ఆటపై ఎలాంటి ప్రభావం చూపలేదనిపించింది. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు.18 సగటుతో బ్యాటింగ్‌తో 189 పరుగులు చేయడంతోపాటు 3 మ్యాచ్‌లలో టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. జడేజా ఈసిరీస్‌లోని 3 మ్యాచ్‌ల్లో కేవలం 37 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేశాడు. దీంతోపాటు 2 వికెట్లు తీశాడు. (ఫోటో AFP)

భువనేశ్వర్ కుమార్: టీ20 ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్ కుమార్ చోటు దక్కించుకుంటాడో లేదో చెప్పడానికి ఈ సిరీస్ చాలు. అయితే, ప్రస్తుతానికి భువీ భారత వైట్‌బాల్ జట్టులో తన స్థానం కోసం కర్చీఫ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పాత ఫాంతో కనిపించాడు. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. సిరీస్‌లో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 15 సగటుతో 3 వికెట్లు పడగొట్టాడు. (ఫోటో AFP)




