AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారు కచ్చితంగా టీమిండియా అభిమానులు కాదు.. అలాంటి ఆలోచనలకు మందే లేదు: ట్రోలర్స్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు

Indian Cricket Team: టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి తర్వాత సోషల్ మీడియాలో మహ్మద్ షమీ(Mohammad Shami) విపరీతంగా ట్రోల్ అయిన విషయం తెలిసిందే.

వారు కచ్చితంగా టీమిండియా అభిమానులు కాదు.. అలాంటి ఆలోచనలకు మందే లేదు: ట్రోలర్స్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు
Mohammed Shami
Venkata Chari
|

Updated on: Feb 28, 2022 | 4:49 PM

Share

టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి తర్వాత సోషల్ మీడియాలో మహ్మద్ షమీ(Mohammad Shami) విపరీతంగా ట్రోల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన మౌనం వీడాడు. నిజానికి అక్టోబర్‌లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా(Indian Cricket Team) తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో షమీ 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఈ ఆటగాడిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మతం కారణంగానే పాకిస్తాన్ మద్దతుదారుడిగా మారావంటూ ట్రోల్స్ చేశారు. అప్పట్లో ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మాజీల నుంచి ఇతర దేశాల ప్లేయర్లు కూడా షమీకి మద్ధతు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌లో టార్గెట్‌ తర్వాత, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli).. షమీని సమర్థించాడు. ట్రోలర్లకు తగిన సమాధానం చెప్పాడు.

మతం ప్రాతిపదికన తనను ట్రోల్స్ చేసిన వ్యక్తులు భారత జట్టుకు నిజమైన అభిమానులు లేదా మద్దతుదారులు కాదని షమీ పేర్కొన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షమీ.. ఇలాంటి వారి ఆలోచనలకు మందే లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశ విధేయతను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదని ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, ‘మీరు ఒక ఆటగాడిని హీరోగా పరిగణించి, ఆ తర్వాత ఇలా ప్రవర్తిస్తే, కచ్చితంగా మీరు భారతదేశానికి మద్దతు ఇచ్చేవారు కాదు. మరి ఇలాంటి వాళ్ళు చేసే స్టేట్ మెంట్స్ పనికిరానివి. అప్పుడు నా మనసులో ఒక్కటే మెదిలింది. నేను ఎవరినైనా నా రోల్ మోడల్‌గా భావిస్తే, నేను అతనితో ఎప్పుడూ చెడుగా మాట్లాడను. ఎవరైనా నా గురించి బాధ కలిగించే మాటలు మాట్లాడితే, అతను నాకు లేదా భారత జట్టుకు అభిమాని కానేకాదు. వాళ్లు చెప్పేది నేను పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చాడు.

‘ఏమి చేయాలో నాకు తెలుసు. భారతదేశం అంటే ఏమిటో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మేg దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. దేశం కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి ట్రోలర్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదా స్పందించడం ద్వారా మనం ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నాడు.

వారు భారత మద్దతుదారులు కాదు.. ‘మీరు మీ హీరోగా భావించే ఆటగాడిని, కేవలం మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శనతో అనుచితంగా ప్రవర్తించారు. ఇది సరికాదు. వారంతా భారత అభిమానులు కాదు. ఎవరైనా నా హృదయాన్ని బాధించేలా మాట్లాడితే, వారు నా అభిమానులు కాదు” అంటూ పేర్కొన్నాడు.

షమీ టెస్టుల్లో 209 వికెట్లు తీశాడు.. 2013లో అరంగేట్రం చేసినప్పటి నుంచి షమీ 57 టెస్టుల్లో 3.26 ఎకానమీ రేటుతో 209 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 5.62 ఎకానమీ రేటుతో 147 వికెట్లు, 17 టీ20ల్లో 9.54 ఎకానమీ రేటుతో 18 వికెట్లు తీశాడు.

Also Read: IND vs SL: లంక సిరీస్‌లో సత్తా చాటిన ముగ్గురు భారత ఆటగాళ్లు.. టీ20 ప్రపంచ కప్‌లో ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ..

Rohit Sharma: టీ20ఐ విజయాల్లో టీమిండియా తగ్గేదేలే.. రోహిత్ సేన దెబ్బకు తారుమారైన ఆ టీంల రికార్డులు..