- Telugu News Photo Gallery Sports photos Daniil Medvedev Reaches No. 1 In ATP Rankings surpasses Novak Djokovic monday
Daniil Medvedev: నోవాక్ జొకోవిచ్‌కు షాకిచ్చిన రష్యన్ ప్లేయర్.. నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్‌గా మారిన డానియల్ మెద్వెదేవ్
రష్యాకు చెందిన డానియల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్న ప్రపంచంలోని 27వ ఆటగాడిగా నిలిచాడు.
Updated on: Feb 28, 2022 | 9:10 PM

పురుషుల ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో (Daniil Medvedev) రష్యాకు చెందిన డానియల్ మెద్వెదేవ్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఈమేరకు ప్రపంచంలోని 27వ ఆటగాడిగా నిలిచాడు. మెద్వెదేవ్ 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్‌ను అగ్రస్థానం నుంచి తప్పించాడు. సెర్బియాకు చెందిన ఈ ఆటగాడు రికార్డు స్థాయిలో 361 వారాల పాటు నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. (ఫోటో-డానియల్ మెద్వెదేవ్ Instagram)

యూఎస్ ఓపెన్ 2021 ఛాంపియన్ మెద్వెదేవ్ జకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే తర్వాత ఎక్కువ కాలం నంబర్ వన్ ర్యాంక్‌ను కలిగి ఉన్న ఐదవ ఆటగాడిగా నిలిచాడు. (ఫోటో-డానియల్ మెద్వెదేవ్ Instagram)

చివరిసారిగా ఐదు సంవత్సరాల క్రితం నవంబర్ 7, 2016న ముర్రే అగ్రస్థానానికి చేరుకున్నప్పుడు పురుషుల టెన్నిస్‌లో కొత్త నంబర్ వన్ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. మెద్వెదేవ్ టాప్ ర్యాంక్ సాధించిన మూడో రష్యా ఆటగాడు. యెవ్జెనీ కఫెల్నికోవ్ ఆరు, మరాట్ సఫిన్ తొమ్మిది వారాల పాటు అగ్రస్థానంలో ఉన్నారు. (ఫోటో-డానియల్ మెద్వెదేవ్ Instagram)

నంబర్ 1 ర్యాంక్ సాధించిన తర్వాత డేనియల్ మెద్వెదేవ్ మాట్లాడుతూ, 'నంబర్ 1 ర్యాంక్‌ను పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా లక్ష్యం. నంబర్ 1 అయిన తర్వాత, నాకు చాలా మంది టెన్నిస్ ప్లేయర్‌ల నుంచి సందేశాలు వచ్చాయి. అందరికి ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నాడు. (ఫోటో-డానియల్ మెద్వెదేవ్ Instagram)

డానిస్ మెద్వెదేవ్ టెన్నిస్ చరిత్రలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన అత్యంత ఎత్తైన ఆటగాడిగా నిలిచాడు. మెద్వెదేవ్ ఎత్తు 198 సెం.మీ.గా ఉంది. ఇతని వయస్సు 26 సంవత్సరాలే కావడం విశేషం. (ఫోటో-డానియల్ మెద్వెదేవ్ Instagram)





























