Maha Shivratri 2022: మహా శివరాత్రి రోజున ఈ మంత్రాలను పఠించండి.. జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి..!
Maha Shivratri 2022: మహాశివరాత్రి పర్వదినాన్ని యావత్ దేశ ప్రజలు భక్తిప్రపత్తులతో జరుపుకుంటున్నారు. వేకువజామునే నిద్రలేచి,
Maha Shivratri 2022: మహాశివరాత్రి పర్వదినాన్ని యావత్ దేశ ప్రజలు భక్తిప్రపత్తులతో జరుపుకుంటున్నారు. వేకువజామునే నిద్రలేచి, ఆదిశంకరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసం ఆచరిస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివ భక్తులు ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. ఆలయాల్లో శివుడికి రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆది శంకరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున శివాలయాల వద్దకు వెళుతున్నారు. శివుడికి ప్రతీకరమైన త్రిదళ పత్రం సహా వివిధ రకాల పుష్పాలతో పూజిస్తున్నారు. అభిషేక ప్రియుడికి నిత్యాభిషేకం చేస్తూ.. స్వామివారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే, భోలాశంకరుడిగా పిలుచుకునే పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించాలని వేదపండితులు, పూజారులు సూచిస్తున్నారు. వేదపండితులు చెబుతున్న ఆ మంత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహాశివరాత్రి నాడు ఈ మంత్రాలను పఠించండి 1. ‘ఓం నమః శివాయ’ ఇది శివ పంచాక్షరి మంత్రం. ఈ శివ పంచాక్షరిని మించిన మంత్రం లేదని అంటారు. ఓం నమః శివాయ అని స్మరిస్తే చాలు ఆ పరమేశ్వరుడి కరుణ మీపై కురుస్తుంది. ఈ మంత్ర మనస్సును శుద్ధి చేస్తుంది. మనసులోని భయాన్ని తొలగిస్తుంది. ప్రతి రోజూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే.. అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు.. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
2. ‘ఓం నమో భగవతే రుద్రాయ’..శివుని అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పరమశివుని అనుగ్రహం పొందడంతో పాటు.. మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.
3. ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర: ప్రచోదయాత్’’.. ఏకాగ్రత కష్టంగా ఉన్నప్పుడు, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ మంత్రాన్ని జపిస్తే ప్రయోజనం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ మంత్రం జపించడం ద్వారా మనస్సు, శరీరం ఏకమై.. ప్రశాంతత దక్కుతుంది.
4. ‘‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||’’.. దీని అర్థం అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి. అని కోరుతూ పరమేశ్వరుడిని ఆరాధించడం. అంటే.. ఈ మంత్రాన్ని దీర్ఘాయుష్షు కోసం జపించడం జరుగుతుంది. అకాల మరణం నుంచి పరమేశ్వరుడు రక్షిస్తాడని విశ్వాసం.
5. ‘‘కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హారం | సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ||’’. శివుని ఈ మంత్రం జపించడం ద్వారా ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం.
చివరగా.. ‘‘ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే..శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే’’ అనే మంత్రం జపించడం ద్వారా జీవితంలో పేదరికం దూరమవుతుంది.
గమనిక: ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని మత గ్రంధాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిని పబ్లిష్ చేయడం జరిగింది.
Also read:
Amritha aiyer: స్టైలిష్ లుక్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న అమృత.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్…
Jobs In Indian Bank: ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..
Kishan Reddy: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..