Indian Bank Jobs: ఇండియన్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..

Bank Jobs 2022: ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది...

Indian Bank Jobs: ఇండియన్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..
Bank Jobs
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 01, 2022 | 5:27 PM

Bank Jobs 2022: ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇండియన్ బ్యాంక్ 202 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indianbank.inలో అప్లయ్ చేయాలి. 9 మార్చి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత

ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో Xmen అయిన 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. UG లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయలేరు. 26 నుండి 29 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస విద్యార్హత 10వ తరగతి (S.S.C./మెట్రిక్యులేషన్) లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా బోర్డు నుండి తత్సమానం పాస్ అయి ఉండాలి.

ఇలా దరఖాస్తు చేసుకోండి

  • అభ్యర్థులు ముందుగా ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.inకి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • ఒక కొత్త పేజీ తెరవబడుతుంది, అక్కడ ఇచ్చిన ‘సెక్యూరిటీ గార్డ్స్ రిక్రూట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థి అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫారమ్‌ను సమర్పించండి.
  • భవిష్యత్ సూచన కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి.

Read also.. BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.