NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు.. ఎవ‌రు అర్హులంటే..

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. జంషెడ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ క్యాంప‌స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు.. ఎవ‌రు అర్హులంటే..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2022 | 6:50 AM

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. జంషెడ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ క్యాంప‌స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 43 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ముందుగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత హార్డ్ కాపీల‌ను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.

* హార్డ్ కాపీల‌ను రిజిస్ట్రార్, నిట్‌ జంషెడ్‌పూర్, ఆదిత్యాపూర్, జంషెడ్‌పూర్, జార్ఖండ్‌–831014 అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను టెస్ట్‌/ప్రజంటేషన్‌/సెమినార్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు 15-03-2022 చివ‌రి తేదీకాగా, హార్డ్ కాపీల‌ను పంపించ‌డానికి 22-03-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..