Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

సాధారణంగా ట్యాటూలుగా పేరు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లను వేయించుకుంటారు. మరికొందరు తమకు ఇష్టమైన వారి పేర్లు, ప్రేమికుల పేర్లను పచ్చబొట్లుగా వేయించుకుంటారు.

Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..
Farhan Weds Shibani
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2022 | 10:06 PM

సాధారణంగా ట్యాటూలుగా పేరు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లను వేయించుకుంటారు. మరికొందరు తమకు ఇష్టమైన వారి పేర్లు, ప్రేమికుల పేర్లను పచ్చబొట్లుగా వేయించుకుంటారు. అయితే ఇటీవల నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ (Farhan Akthar)తో ఏడడుగులు నడిచిన నటి శిబానీ దండేకర్‌ (Shibani Dandekar) ఓ తేదీని ట్యాటూగా వేయించుకుంది. ఇంతకీ ఆ తేదీ స్సెషల్ ఏంటో తెలుసుకుందాం రండి.నటుడు, డైరెక్టర్‌, స్ర్కీన్‌ రైటర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌, ప్రొడ్యూసర్‌, యాంకర్‌.. ఇలా బాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఫర్హాన్‌ అక్తర్‌ . ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తుఫాన్’ చిత్రాలతో హీరోగానూ మంచి విజయాలు సొంతం చేసుకున్నాడు. కాగా నాలుగేళ్లుగా మోడల్‌, నటిశిబానీ దండేకర్‌ తో ప్రేమలో ఉన్న అతను ఇటీవల ఆమెతో కలిసి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ముంబయిలోని ఖండాలాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హృతిక్ రోషన్, రియాచక్రవర్తి, అనుషా దండేకర్, ఫరాఖాన్‌ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఫర్హాన్‌- శిబానీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తన పెళ్లి తేదీనే మోచేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది శిబానీ. రోమన్ నంబర్లలో వెడ్డింగ్‌ డేట్‌ కనిపించేలా ఈ ట్యూటూ వేయించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా శిబానీ గతంలోనే ఫర్హాన్ పేరును తన మెడపై ట్యాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫర్హాన్ అక్తర్‌కు గతంలోనే అధునా బబానీతో వివాహాం అయింది. వీరిద్దరికి షక్యా, అఖీరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అనివార్య కారణాలతో 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. బబానీతో బ్రేకప్‌ అయ్యాక శిబానీ దండేకర్‌లో ప్రేమను వెతుక్కున్నాడు ఫర్హాన్‌. తాజాగా ఆమెతో పెళ్లి పీటలెక్కాడు. అన్నట్లు ఫర్హాన్‌ అక్తర్‌కు టాలీవుడ్‌ హీరోలతోనూ మంచి సాన్నిహిత్యముంది. మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలోని ‘ఐ డోంట్‌ నో’ సాంగ్‌ను ఆలపించింది అతనే.

Also Read:Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య

Dhanush And Aishwarya: విడాకుల తర్వాత కామన్‌ ఫ్రెండ్‌ పార్టీలో ధనుష్‌, ఐశ్వర్య.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..