ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య
Death

ప్రస్తుత సమాజంలో యువతీయువకుల మధ్య ప్రేమ(Love)లు సర్వసాధారణమయ్యాయి. ప్రేమ మైకంలో పడి హద్దులు దాటిపోతున్నారు. తెలిసీ, తెలియని వయసులో ఆకర్షణకు, అనుబంధానికి అర్థం తెలుసుకోలేకపోతున్నారు...

Ganesh Mudavath

|

Mar 01, 2022 | 9:46 PM

ప్రస్తుత సమాజంలో యువతీయువకుల మధ్య ప్రేమ(Love)లు సర్వసాధారణమయ్యాయి. ప్రేమ మైకంలో పడి హద్దులు దాటిపోతున్నారు. తెలిసీ, తెలియని వయసులో ఆకర్షణకు, అనుబంధానికి అర్థం తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైతే తట్టుకోలేకపోతున్నారు. ఇక తమకు జీవితమే లేదన్నట్లు ఆత్మహత్యలకూ(Suicide) పాల్పడుతున్నారు. నిండు జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్(Mahaboob Nagar) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమలో విఫలమయ్యాననే కారణంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూరు గ్రామానికి చెందిన వడ్డె రాములు, సాయమ్మ దంపతులు నివాసముంటున్నారు. వీరి మూడో కుమారుడు మహేశ్‌, తమ్ముడు హరికృష్ణతో కలిసి స్వగ్రామం అమ్మాపూరులో ఉంటూ మెకానిక్ పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో మహేశ్ హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇతని ప్రేమను ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందాడు. మూడు నెలల నుంచి ఒంటరిగా ఉంటూ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆదివారం రాత్రి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ చేసి, చనిపోయేందుకు ప్రయత్నించగా హరికృష్ణ గమనించి వారించాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన మహేశ్.. ముత్యాలంపల్లి శివారులోని రైల్వేట్రాక్ పై పడుకున్నాడు. యశ్వంత్‌పూర్‌ నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న సంపర్గ్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు మృతదేహన్ని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Also Read

IPL 2022: షాకిచ్చిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. అయోమయంలో గుజరాత్.. హార్దిక్ ముందు 4 ఎంపికలు!

Lips Darker: ఈ 5 చెడ్డ అలవాట్లు మీ పెదాలని నల్లగా మారుస్తాయి.. ఇప్పుడే వదిలించుకోండి..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu