AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lips Darker: ఈ 5 చెడ్డ అలవాట్లు మీ పెదాలని నల్లగా మారుస్తాయి.. ఇప్పుడే వదిలించుకోండి..!

Lips Darker: ప్రతి ఒక్కరు అందమైన పెదాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ పెదవుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే ముఖం అందంగా కనిపించడంలో

Lips Darker: ఈ 5 చెడ్డ అలవాట్లు మీ పెదాలని నల్లగా మారుస్తాయి.. ఇప్పుడే వదిలించుకోండి..!
Lips Darker
uppula Raju
|

Updated on: Mar 01, 2022 | 8:13 PM

Share

Lips Darker: ప్రతి ఒక్కరు అందమైన పెదాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ పెదవుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే ముఖం అందంగా కనిపించడంలో పెదాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. కొన్ని చెడు అలవాట్ల వల్ల పెదవులు నల్లగా మారుతాయి. అంద విహీనంగా కనిపిస్తాయి. వాటిని వదులుకుంటే మంచిది. అలాంటి చెడ్డ అలవాట్ల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది పాత లిప్ బామ్ ఉపయోగించడం. లిప్ బామ్ వాడితే అది పాతది కాకుండా శ్రద్ధ వహించండి. లేదంటే ఎక్స్ పైరీ అయిన ఉత్పత్తులు పెదాల అందాన్ని దూరం చేస్తాయి. నల్లగా మార్చేస్తాయి. మరోవైపు డెడ్‌స్కిన్ కూడా పెదవులపై పేరుకుంటుంది. దీనిని క్రమం తప్పకుండా తొలగించడం ముఖ్యం. లేదంటే పెదవులపై ముడతలు ఏర్పడుతాయి. పెదవులపై ఏర్పడిన మృతకణాలను తొలగించడంతోపాటు మసాజ్ చేయడం అవసరం. అప్పేడే అవి ఆరోగ్యంగా ఉంటాయి.

ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికి తెలుసు. అయినా సిగరెట్ అలవాటుని ఎవ్వరూ మానుకోవడం లేదు. సిగరెట్ వల్ల ఊపిరితిత్తులకు చాలా నష్టం వాటిల్లుతుంది. పొగతాగే అలవాటు ఉన్నవారి పెదవులు నల్లగా మారుతాయి. చివరకు అవి అంద విహీనంగా తయారవుతాయి. లిప్‌స్టిక్‌లో హానికరమైన రసాయనాల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నాణ్యత లేని లిప్‌స్టిక్‌లు మార్కెట్లో లభిస్తాయి. ఇవి పెదవులకు చాలా హాని కలిగిస్తాయి. మీరు లిప్ స్టిక్ వాడకాన్ని తగ్గించి మంచి బ్రాండ్ ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం. శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా పెదాలు నల్లగా మారుతాయి. కాబట్టి ప్రతిరోజు సరిపోయే విధంగా నీరు తీసుకోవాలి. ఇది పెదాలను హైడ్రేట్‌గా ఉంచుతుంది. అప్పుడప్పుడు పెదాలకి కొత్తిమీర రసం రాస్తు ఉండాలి. తాజాగా మెరుస్తాయి.

Diabetics: షుగర్ పేషెంట్లు ఈ పండ్లని తింటున్నారా.. ఒక్కసారి ఈ విషయాలు గమనించండి..!

Urine smell : మూత్రంలో దుర్వాసన వస్తుందా? ఈ సమస్యకు ముఖ్య కారణాలు ఇవే..

Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ ఆకుకూర విషంతో సమానం.. అస్సలు తినకండి..!