Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urine smell : మూత్రంలో దుర్వాసన వస్తుందా? ఈ సమస్యకు ముఖ్య కారణాలు ఇవే..

Urinary Infection Symptoms: మూత్రంలో దుర్వాసన (మూత్ర వాసన ) ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ ఉందని భావించి విస్మరిస్తుంటారు.

Urine smell : మూత్రంలో దుర్వాసన వస్తుందా? ఈ సమస్యకు ముఖ్య కారణాలు ఇవే..
Urine Smell
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 01, 2022 | 7:26 PM

Urinary Infection Symptoms: మూత్రంలో దుర్వాసన (మూత్ర వాసన ) ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ ఉందని భావించి విస్మరిస్తుంటారు. చాలాసార్లు టాయిలెట్‌కి వెళ్లిన తరువాత ఆ ప్రదేశంలో తీవ్రమైన దుర్గంధం వస్తుంటుంది. ఎక్కువ మంది మూత్ర విసర్జన చేసే పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రదేశాలలో ఆ దుర్గంధాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక నోటి దుర్వాసన అనేది చాలా సాధారణం. కానీ కొన్నిసార్లు ఈ దుర్వాసన కూడా ఏదో ఒక వ్యాధి లక్షణంగా పేర్కొంటారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక ఇతర సమస్యలు వస్తుంటాయి. ఇదే మాదిరిగా మూత్రం దుర్వాన వస్తున్నా.. ఏదో ఒక వ్యాధి లక్షణం అయి ఉండొచ్చు. అందుకే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రం దుర్వాసన పలు కారణాల వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో సాధారణ సమస్య. సూక్ష్మక్రిములు మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడు ఈ సమస్య తీవ్రమవుతుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు కిడ్నీలు, మూత్రాశయం, దానికి అనుసంధానించబడిన నాళాలపై కూడా ప్రభావం చూపుతాయి. సకాలంలో గుర్తించకపోతే, ఇన్ఫెక్షన్ కిడ్నీలకు వ్యాపించి, దెబ్బతింటుంది.

2) నీటి కొరత.. మానవ శరీరం మూత్రం ద్వారా వ్యర్థ పదార్థాలను విసర్జిస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, విషపూరిత పదార్థాలను విడుదల చేయదు. అందువల్ల, ఈ వ్యర్థాలు సులభంగా విసర్జించబడవు. ఫలితంగా మూత్రంలో బలమైన దుర్వాసన వస్తుంది. కాబట్టి, శరీరానికి సరిపడ నీటిని తాగడం చాలా ముఖ్యం.

3) కాఫీ అధిక మోతాదు.. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం దుర్వాసన వస్తుంది. కాఫీ కూడా డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఇది మూత్రం, నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

4) మధుమేహం.. మధుమేహం వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరను జీర్ణించుకోలేకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. లేదంటే మూత్రం దుర్వాసన పెరుగుతుంది.

5) STI.. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు లేదా STIలు కూడా మూత్రం దుర్వాసనకు కారణం కావచ్చు. కొన్నిసార్లు ఈ అంటువ్యాధులు మూత్ర నాళాల వాపుకు కారణమవుతాయి. ఇది మూత్రం దుర్వాసనకు కారణమవుతుంది. స్త్రీలలో జననేంద్రియాల వాపు వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది.

6) ఈస్ట్ ఇన్ఫెక్షన్.. కాండిడా అనే ఫంగస్ సాధారణంగా మీ చర్మంపై ఉంటుంది. స్త్రీల యొక్క కఠినమైన భాగంతో సహా శరీరంలోని ఏ భాగానైనా ఫంగస్ కనుగొనవచ్చు. ఈ శిలీంధ్రాలు అధిక పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు, శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. తడి బట్టలు ధరించడం, మురికి నీటిలో ఉండటం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణం అవుతుంది. పురుషుల కంటే స్త్రీలకు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. దీని కారణంగా మూత్ర విసర్జన సమయంలో దుర్వాసన వస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు పురుషులలో కూడా కనిపిస్తాయి. కానీ అవి స్త్రీలలో వలె తీవ్రంగా ఉండవు. కాబట్టి శారీరక పరిశుభ్రత ముఖ్యం.

Also read:

Maha Shivratri 2022: ఇషా ఫౌండేషన్‌లో ఘనంగా శివరాత్రి వేడుకులు.. లైవ్ వీడియో మీకోసమే

Russia Ukraine War: ఈయూ మాతోనే ఉందని నిరూపించుకోవాలి.. మేం ఒంటరిగా పోరాటం చేస్తున్నాం.. జెలెన్‌స్కీ..

Evening Snacks: సాయంత్రం స్నాక్స్‌గా ఇవి తింటే సూపర్.. రుచితో పాటు మంచి ఆరోగ్యం..