AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఈయూ మాతోనే ఉందని నిరూపించుకోవాలి.. మేం ఒంటరిగా పోరాటం చేస్తున్నాం.. జెలెన్‌స్కీ..

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం యూరోపియన్ యూనియన్‌కు ఒక విజ్ఞప్తి చేశాడు..

Russia Ukraine War: ఈయూ మాతోనే ఉందని నిరూపించుకోవాలి.. మేం ఒంటరిగా పోరాటం చేస్తున్నాం.. జెలెన్‌స్కీ..
Eu
Srinivas Chekkilla
|

Updated on: Mar 01, 2022 | 7:01 PM

Share

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం యూరోపియన్ యూనియన్‌కు ఒక విజ్ఞప్తి చేశాడు. యూరోపిన్‌ యూనియన్ ఉక్రెయిన్‌తో ఉందని చెప్పాలని కోరారు. యూరోపియన్‌ యూనియన్ లేకుండా, ఉక్రెయిన్ ఒంటరిగా పోరాటం చేస్తుందని. మేము మా బలాన్ని నిరూపించుకున్నామని జెలెన్‌స్కీ చెప్పారు. కాబట్టి యూరోపియన్ యూనియన్ మాతో ఉందని నిరూపించండని విజ్ఞప్తి చేశారు. “మా నగరాలన్నీ ఇప్పుడు రష్యా ఆక్రమించుకున్నప్పటికీ, మేము మా భూమి, మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాము. మమ్మల్ని ఎవరూ విచ్ఛిన్నం చేయరు, మేము బలంగా ఉన్నాము, మేము ఉక్రేనియన్లు.” అని జెలెన్‌స్కీ చెప్పారు.

EU చట్టసభ సభ్యులు రష్యాను “పోకిరి రాజ్యం” అని పిలుస్తారని, 27-దేశాల కూటమిని మరింత కఠినమైన ఆంక్షలను విధస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పొరుగు దేశంపై గత వారం యుద్ధం ప్రారంభించిన తర్వాత, యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఫైనాన్సింగ్ ఆయుధ డెలివరీలతో సహా చాలా చర్యలు తీసుకుంది. పుతిన్ “20వ శతాబ్దపు నియంతల అత్యంత భయంకరమైన ప్రకటనలను గుర్తుచేసుకుంటూ ఈ పోరాటం వీరోచితమైనదని తీర్మాన ముసాయిదా పేర్కొంది. రష్యా నాయకత్వానికి దగ్గరగా ఉన్న ఒలిగార్చ్‌లు, అధికారులపై కఠినంగా వ్యవహరించాలని, రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను పరిమితం చేయాలని, రష్యా దాని మిత్రదేశమైన బెలారస్‌ను SWIFT బ్యాంక్ మెసేజింగ్ సిస్టమ్ నుండి పూర్తిగా నిషేధించాలని, అన్ని EU పోర్ట్‌లను మూసివేయాలని యూరోపియన్ పార్లమెంట్ EU నాయకులను కోరుతుంది.

మేము నిలబడతాము, మా విలువల కోసం పోరాడుతాం. పుతిన్ యుద్ధం చేస్తుంటే చూస్తూ ఉండలేం” అని EU పార్లమెంట్ అధ్యక్షుడు రాబర్టా మెత్సోలా అన్నారు. ఇది ఇలా ఉంటే రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడి చేసి మంగళవారం రాజధాని కైవ్‌కు సమీపంలో సాయుధ వాహనాలు, ఫిరంగిదళాలను మోహరించాయి. రష్యా దండయాత్ర ప్రారంభించి ఆరో రోజున, ఉక్రెయిన్‌లోని రెండో నగరమైన ఖార్కివ్‌లోని అధికారులు, రష్యన్ సైన్యం స్థానిక పరిపాలనా భవనంపై షెల్‌ దాడి చేసి కనీసం 10 మందిని చంపిందని చెప్పారు.

Read Also.. Russia Ukraine Crisis: పుతిన్‌కు షాకిచ్చిన వరల్డ్ టైక్వాండో.. బ్లాక్ బెల్ట్‌‌ వెనక్కు..