Health Tips: ఫ్రిజ్‌లో ఈ పండ్లను ఉంచుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే.. లిస్టులో ఏమున్నాయంటే?
ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు అన్ని పండ్లను, కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచుతుంటాం. అయితే కొన్నింటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయని మీకు తెలుసా?
Health Tips: ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్ల(Fruits)ను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు ఉంచుతుంటాం. ఇలా చేయడం వల్ల చాలాకాలం పాటు తాజాగా ఉంటాయని, చెడిపోకుండా ఉంటాయని భావిస్తుంటాం. అయితే అన్ని రకాల పండ్లను ఫ్రిజ్(Fridge)లో ఉంచలేమని మీకు తెలుసా. పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల చాలా వరకు పాడయ్యే ఛాన్స్ లేదా విషపూరితంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పల్ప్‌తో కూడిన పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదని తెలుసుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచిన పండ్లను తినడం వల్ల ప్రయోజనం కలగకపోవడంతోపాటు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఫ్రిజ్‌లో ఏయే పండ్లను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1- అరటిపండు- అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల చాలా త్వరగా నల్లగా మారుతుంది. అరటి కాండం నుంచి ఇథిలీన్ వాయువు విడుదలవుతుంది. దీని వలన ఇతర పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో లేదా ఇతర పండ్లతో ఉంచకూడదు.
2- యాపిల్స్- యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పండిపోతుంది. దీని వెనుక కారణం యాపిల్‌లో కనిపించే క్రియాశీల ఎంజైమ్‌లు. కాబట్టి యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచవద్దు. మీరు ఆపిల్ పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే, వాటిని కాగితంలో చుట్టి ఉంచండి. అంతే కాకుండా రేగు, చెర్రీ, పీచు వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
3- పుచ్చకాయ- వేసవిలో ప్రజలు పుచ్చకాయను విపరీతంగా తింటారు. కానీ, ఇంత పెద్ద పండును ఒక్కసారిగా తినడం కష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటుంటారు. ఇది చాలా తప్పు. ఎప్పుడూ పుచ్చకాయను కత్తిరించి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి తినడానికి ముందు మాత్రమే అది కూడా కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
4- మామిడి- మామిడి పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచవద్దు. దీని వల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. దీని వల్ల మామిడిలోని పోషకాలు కూడా నశిస్తాయి. మామిడి పండ్లను కర్బైడ్‌తో ఉంచుతుంటుంటారు. దీంతో వీటిని నీటిలో కలిపితే త్వరగా పాడైపోతాయి.
Also Read: Obesity: ఊబకాయం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందా?
Aloe Vera Benefits: మీ చర్మం మిలమిల మెరిసిపోవాలా.. అయితే కలబందతో ఇలా చేయండి..