Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

Hair Fall: జుట్టు రాలడం అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చిన్న వయస్సులో

Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!
ఉప్పు: కళ్లలో మంట కారణంగా వాటి నుంచి నీరు నిరంతరం దారాగా కారుతూ ఉంటుంది. దీని కోసం, ముందుగా నీటిలో ఉప్పు కలపండి.. ఆ నీటిలో ఒక గుడ్డను ముంచి కళ్లపై ఉంచండి. కొంత సమయం తర్వాత సాధారణ నీటితో కళ్లను కడగితే సరి.
Follow us
uppula Raju

|

Updated on: Mar 01, 2022 | 9:57 PM

Hair Fall: జుట్టు రాలడం అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చిన్న వయస్సులో జుట్టు రాలడం వల్ల టెన్షన్ పెరుగుతుంది. సాధారణంగా జుట్టు రాలడం అనే సమస్య 40 లేదా 50 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు రాలడానికి వయసుతో సంబంధం లేదు. మీ ఆహారపు అలవాట్ల పొరపాటు ఈ సమస్యను మరింత పెంచుతుంది. జుట్టు రాలడం సమస్యను ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు. దీనిలో పురుషులు, మహిళలు ఇద్దరు బాధితులే. అయితే ఆహారంలో ఒకదానిని తక్కువగా తీసుకుంటే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజువారీ ఆహారంలో ఎక్కువ ఉప్పును ఉపయోగిస్తే అది జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అధిక ఉప్పు తినడం వల్ల సోడియం ఎక్కువవుతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల అవసరమైన పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరవు.

బలమైన జుట్టు కోసం ఆహారంలో విటమిన్లు, ఖనిజాలని చేర్చడం చాలా ముఖ్యం. విటమిన్ B5, ఇనుము సమృద్దిగా ఉంటే జుట్టు పల్చబడదు. ఆరోగ్యంగా ఉంటుంది. ప్రోటీన్ జుట్టులో మెరుపును పెంచుతుంది. వెంట్రుకల సమస్య జన్యుపరంగా కూడా ఉంటుంది అంతే కాకుండా కాలుష్యం కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. కండరాలు, నరాల సరైన పనితీరు కోసం శరీరంలో ఉప్పు అవసరం. కానీ మీరు దానిని ఎక్కువగా తీసుకుంటే అది రక్తపోటును పెంచుతుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. ఆహారంలో కనీసం ఉప్పును ఉపయోగించడం అవసరం. కానీ అధికంగా తీసుకోవడం అనారోగ్యం.

గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!