Health Tips: లేట్ నైట్ ఆకలిగా ఉంటుందా? అయితే.. ఈ 5 ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకోండి..

Late Night Food: చాలా మందికి రాత్రి సమయంలో ఆకలవుతుంటుంది. ఎప్పుడో ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడం, రాత్రి భోజనం చేసిన

Health Tips: లేట్ నైట్ ఆకలిగా ఉంటుందా? అయితే.. ఈ 5 ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకోండి..
Food
Follow us

|

Updated on: Mar 02, 2022 | 6:30 AM

Late Night Food: చాలా మందికి రాత్రి సమయంలో ఆకలవుతుంటుంది. ఎప్పుడో ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడం, రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా అర్ధరాత్రి ఆకలితో మెలకువ రావడం, నిద్ర పట్టకపోవటం.. వంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రాత్రిపూట ఏదైనా తినాలనే కోరిక కలుగుతుంది. అయితే అలాంటి సమయంలో ఏం తినాలనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే రాత్రిపూట ఏదైనా తింటే.. కడుపులో, ఛాతిలో ఇబ్బంది తలెత్తుతుంది. అంతేకాదు అర్థరాత్రి ఏదైనా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ఆకలేసినా.. ఏమీ తినకుండానే పడుకుంటారు. అయితే, అలా చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొంచెం ఆహారం తిని అర్థరాత్రి ఆకలిని తీర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఎలాంటి సమస్యలుండవని చెబుతున్నారు.. మరి ఆ ఆరోగ్యకరమైన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1) డ్రై ఫ్రూట్స్.. మీరు పగలు లేదా రాత్రి ఎప్పుడైనా ఆకలితో ఉంటే డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంగా తీసుకోవచ్చు. ఎండు గింజలు, బాదం పప్పులు శరీరానికి మంచి ప్రొటీన్లను అందిస్తాయి. ఇది జీర్ణం కావడం కూడా సులభం కాబట్టి అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే వీటిని తినొచ్చు. అంతేకాదు.. ఇది ఆకలిని అణచివేసి, శక్తిని ఇస్తుంది.

2) పండ్లు.. రాత్రిపూట భోజనం చేసినా అర్థరాత్రి సమయంలో చాలా మందికి ఆకలి వేస్తుంది. అలాంటి సమయంలో పండ్లు తినడం మంచిది. పండ్లలో నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, సులభంగా జీర్ణం కావడం వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. పండ్లు తింటే ఆకలి తీరుతుంది. అరటిపండ్లు, యాపిల్స్ మొదలైన వాటిని తినొచ్చు.

3) చీజ్.. పచ్చి పనీర్ కూడా తినొచ్చు. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో ఆకలిగా అనిపిస్తే పనీర్‌ను తినొచ్చు. పనీర్‌ ఆకలిని తగ్గించి.. తక్షణ శక్తినిస్తుంది.

4) పాప్‌కార్న్.. చాలా మంది పాప్‌కార్న్‌ ఇష్టపడతారు. రాత్రి ఆకలి వేస్తే పాప్‌కార్న్‌ను కూడా తినొచ్చు. పాప్‌కార్న్ ప్యాకెట్లు మార్కెట్‌లో విరివిగా దొరుకుతాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. అర్థ రాత్రి ఆకలివేస్తే వీటితో మీ ఆకలిని తీర్చుకోవచ్చు.

5) ఉడికించిన గుడ్లు.. ఉడికించిన గుడ్లలో చాలా పోషకాలు ఉంటాయి. గుడ్డు తింటే కూడా ఆకలి తీరుతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఆకలి మందగించి, అందులోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి రాత్రి వేళలలో ఆకలివేస్తే ఉడికించిన గుడ్లను తినొచ్చు.

Also read:

Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య