Summer Diet: వేసవిలో మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.. ఉదర సమస్యలకు చెక్ పెట్టండి..

Summer Diet: వేసవిలో మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.. ఉదర సమస్యలకు చెక్ పెట్టండి..
Healthy Food

Digestion Tips: శీతాకాలం ముగిసింది.. వేసవి ప్రారంభమవుతుంది. ఇంతకాలం చలికి అలవాటుపడిన శరీరం.. కొత్త సీజన్‌కు అలవాటు పడేందుకు

Shiva Prajapati

|

Mar 02, 2022 | 7:10 AM

Digestion Tips: శీతాకాలం ముగిసింది.. వేసవి ప్రారంభమవుతుంది. ఇంతకాలం చలికి అలవాటుపడిన శరీరం.. కొత్త సీజన్‌కు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. మారుతున్న కాలంతో పాటు.. అనేక శారీరక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మీరు తినే ఆహారంతో పాటు.. జీవనశైలిలో మార్పు చేసుకోకపోతే.. అది మీ శరీరంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. కాలానుగుణంగా శరీర ఉష్ణోగ్రత మారుతుంది, ఈ సమయంలో శరీరానికి తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం అవసరం. ఇది ఉదర సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. వేసవిలో వేయించిన, మసాలా ఆహారాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఆయుర్వేదంలో సగం రోగాలకు మూల కారణం జీర్ణాశయం అంటారు. వ్యాధులకు దూరంగా ఉండాలంటే జీర్ణక్రియపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదర సంబంధిత సమస్యలు ఉంటే.. ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే వేసవిలో ముఖ్యంగా ఈ 5 ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

ఉసిరికాయ.. ఉసిరికాయ జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు వేసవిలో రోజూ ఉసిరికాయను తినాలి. ఉసిరికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్ని తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరికాయలను తింటే మరిన్ని ప్రయోజనాలుంటాయి. అయితే, ఇది తిన్న అరగంట వరకు ఇతర పదార్థాలేవి తినకూడదు. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సగ్గుబియ్యం.. ఇంట్లో కిచడీని ఇష్టపడని వారుండరు. చాలా తొందరగా పూర్తయ్యే వంటకం ఖిచిడీ. ఇది ఎంత త్వరగా తయారవుతుందో.. అంతే త్వరగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తగ్గాలంటే సగ్గు బియ్యంతో చేసిన సూప్, ఖిచిడీ తింటే ప్రయోజనం ఉంటుంది. దీనిని వారానికి ఒకసారైనా చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు.. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. పెరుగును తీసుకోవడం ద్వారా గ్యాస్, ఎసిడిటీ తదితర సమస్యలు రావు.

ఇడ్లీ.. ఇడ్లీ చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇడ్లీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు భారతదేశం అంతటా చాలా రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధి పొందింది. ఇడ్లీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, త్వరగా జీర్ణం కావడం వల్ల అన్ని ఉరద సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇడ్లీ చాలా చోట్ల రావితో తయారు చేస్తారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తప్పనిసరిగా ఇడ్లీ తినాలి.

పెసలు.. వేసవిలో పెసల్లను ఆహారంలో చేర్చుకోవాలి. ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఈ పప్పు సులభంగా జీర్ణమవుతాయి. ఆకు కూరలతో కలిపి ఈ పప్పును వండుకుని తింటే.. మంచి ప్రయోజనం చేకూరుతుంది.

Also read:

Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

‘శాంతి కోరేది ఒకరైతే.. యుద్ధానికి సై అంటోది మరొకరు.. దేశమొకటే అయినా వారి ఆశయాలు మాత్రం వేరే’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu