AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall: మీకు జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందా?.. అసలు కారణం ఇదేనట.. ఇప్పుడే తెలుసుకోండి..

Hair Fall: కాలుష్యం , మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మొదలైనవి మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.

Hair Fall: మీకు జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందా?.. అసలు కారణం ఇదేనట.. ఇప్పుడే తెలుసుకోండి..
Hair Loss
Shiva Prajapati
|

Updated on: Mar 02, 2022 | 7:40 AM

Share

Hair Fall: కాలుష్యం , మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మొదలైనవి మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మీ రోజువారీ ఆహారంలో తినే పదార్థాలు కూడా జుట్టుపై ప్రభావం చూపుతాయి. కొన్ని జుట్టు పోషణకు ఉపకరిస్తే.. మరికొన్ని జుట్టు రాలడానికి కారణమవుతాయి. అవును ఇది నిజంగా నిజం. మనం తినే ఆహారంలో ఉపయోగిస్తే కొన్ని పదార్థాలు జుట్టు రాలడానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం అనేది స్త్రీ, పురుషులిద్దరిలోనూ వివిధ రకాలుగా కనిపిస్తుంది. జుట్టు రాలడానికి అత్యంత సాధారణమైన పరిస్థితిని ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ అంటారు. దీని కారణంగానే పురుషులు, స్త్రీలలో జుట్టు రాలుతుంది. 50 ఏళ్లు పైబడిన పురుషులలో, 65 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఇది సర్వసాధారణం. అయితే, ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య అధికమవుతోంది. ఈ సమస్యకు మనం తినే ఆహారంలో ఉండే పదార్థాలే కారణం అంటున్నారు. మరి ఆ పదార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణులు ఏమంటున్నారు? ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలే సమస్య అధికమవుతుందని బ్రిటన్‌లోని ప్రముఖ ట్రైకాలజిస్ట్ కెవిన్ మూర్ తెలిపారు. దీని వల్ల జుట్టు రాలిపోతుందన్నారు. ‘‘అతిగా ఉప్పు తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. అది వెంట్రుకల కుదుళ్ల చుట్టూ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌లో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కు అవసరమైన పోషకాలను చేరకుండా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య అధికమవుతుంది.’’ అని చెప్పారు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల జుట్టు నిర్జీవంగా, బలహీనంగా మారుతుందన్నారు. అలాగని ఉప్పు తక్కువ మోతాదులో తీసుకున్నా సమస్యే ఏర్పడుతుందంటుననారు. ఉప్పు తక్కువగా తింటే శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడుతుంది. ఇది థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జుట్టు బలంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ఐరన్, విటమిన్ బి5 జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు బలంగా ఉండాలంటే ప్రోటీన్ తప్పనిసరి.

ఎక్కువ ఉప్పు ప్రమాదకరం.. నరాలు, కండరాల పనితీరుకు మెరుగ్గా ఉండేందుకు శరీరానికి సరైన మోతాదులో ఉప్పు అవసరం. కానీ అధిక మొత్తంలో వినియోగిస్తే అది రక్తపోటుకు దారి తీస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. NHS ప్రకారం.. పెద్దలు రోజుకు 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. ఇది సుమారుగా ఒక టీస్పూన్, ఇందులో 2.4 గ్రాముల సోడియం ఉంటుంది. కొన్ని ఆహారాలలో అప్పటికే ఉప్పు ఉంటుంది. ఉదాహరణకు, టమోటా సాస్‌లు, ప్యాక్ చేసిన ఆహారాలు, రొట్టెలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు మరియు సూప్‌లు వంటి వాటిలో ఇప్పటికే కొంత ఉప్పు ఉంటుంది. అలాంటప్పుడు, మీరు కొనుగోలు చేస్తున్న వాటిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.

Also read:

Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య