గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!
Symphony Cooler: వేసవికాలం వచ్చేసింది. రోజు రోజుకి ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో ప్రజలందరు చల్లదనాన్ని కోరుకుంటారు. చాలామంది ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలపై
Symphony Cooler: వేసవికాలం వచ్చేసింది. రోజు రోజుకి ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో ప్రజలందరు చల్లదనాన్ని కోరుకుంటారు. చాలామంది ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలపై ఆధారపడుతారు. అయితే సామాన్యులు ఏసీని కొనాలంటే ఖరీదైన విషయం. కానీ కూలర్లని కొనుగోలు చేయవచ్చు. ఇవి కూడా ఏసీ ఇచ్చిన చల్లదనాన్నే ఇస్తాయి. అయితే తక్కువ ధరలో ఏసీ మాదిరి గోడకి ఫిట్ చేసుకునే ఒక కూలర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ వేసవిలో దీనిని తెచ్చుకుంటే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ కూలర్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా కూలర్‌ని భూమిపై ఉంచుతారు. ఏసీని గోడకు బిగిస్తారు. కానీ ఏసీలా గోడకు ఫిట్ చేసుకునే కూలర్ మార్కెట్లోకి వచ్చింది. ఇండియాలో మొదటిసారిగా ఏసీ తరహ కూలర్‌ని సింఫనీ కంపెనీ ప్రవేశపెట్టింది. దీనిపేరు సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్. ఇది ఏసీ అంతటి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా విద్యుత్‌ని తక్కువగా వినియోగిస్తుంది. అంతే కాకుండా దీన్ని ఏసీ మాదిరి రిమోట్‌తో ఆపరేట్ చేయొచ్చు. భూమిపై ఉండే కూలర్ల మాదిరిగా ప్రతిరోజూ దీనికి నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా దానికి ఒక చిన్నపాటి ట్యాంక్ అమర్చబడి ఉంటుంది.
సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ సామర్థ్యం15 లీటర్లు. ఇందులో 15 లీటర్ల నీరు పట్టే ట్యాంక్ ఉంటుంది. ఇది దాదాపు 2000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు చల్లని గాలిని అందిస్తుంది. దీనికి మూడు వైపుల కూలింగ్ ప్యాడ్‌తో కప్పబడి ఉంటుంది. దీనిని ఆపరేట్ చేయడానికి పదే పదే దాని దగ్గరికి వెళ్లనవసరం లేదు. రిమోట్‌తో దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. రిమోట్‌తో కూడిన సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్‌ని మార్కెట్లో రూ.14,999 నుంచి విక్రయిస్తున్నారు. అయితే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో10 శాతం డిస్కౌంట్‌తో రూ.13,499లకే లభిస్తుంది. దీంతో పాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే రూ.675 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ల ద్వారా కొనుగోలు చేస్తే చివరికి ఆ కూలర్ రూ.12,824కే దొరుకుతుంది. ఏసీతో పోల్చితే ధర చాలా తక్కువ. అంతేగాకుండా ఎక్కువ మంది దీనికింద చల్లదనాన్ని పొందే అవకాశం ఉంటుంది.