ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకి రూ. 4,950 వడ్డీ.. ఎఫ్డీలతో పోల్చితే చాలా ఎక్కువ..!

Monthly Income: పోస్టాఫీసు పొదుపు పథకాలు మంచి రాబడిని అందిస్తాయి. సామాన్య ప్రజలకు వీటివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. నెలకి గ్యారెంటీ ఆదాయం లభిస్తుంది. అందులో

ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకి రూ. 4,950 వడ్డీ.. ఎఫ్డీలతో పోల్చితే చాలా ఎక్కువ..!
Income
Follow us
uppula Raju

|

Updated on: Mar 01, 2022 | 3:08 PM

Monthly Income: పోస్టాఫీసు పొదుపు పథకాలు మంచి రాబడిని అందిస్తాయి. సామాన్య ప్రజలకు వీటివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. నెలకి గ్యారెంటీ ఆదాయం లభిస్తుంది. అందులో ఒకటి పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (monthly income scheme). ఈ స్కీమ్‌ ప్రకారం.. సింగిల్ ఖాతాలో రూ. 4.5 లక్షలు, జాయింట్‌ ఖాతాలో రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. 01.04.2020 నుంచి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ప్రతినెలా 6.6% వడ్డీ చెల్లిస్తున్నారు. ఒక ఖాతాదారుడు ఇందులో రూ. 4.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 29,700 వార్షిక వడ్డీని పొందుతారు. జాయింట్ అకౌంట్ హోల్డర్లు రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే రూ.59,400 వడ్డీ పొందుతారు. ఈ డబ్బులని విభజిస్తే నెలకు రూ. 4,950 ఆదాయం వస్తుంది.

ఈ స్కీమ్‌ ప్రకారం ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయినప్పటి నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లిస్తారు. కానీ ప్రతి నెలా చెల్లించవలసిన వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్ చేయకపోతే దానిపై ఎటువంటి అదనపు వడ్డీని పొందలేరు. డిపాజిటర్ చేసిన ఏదైనా అదనపు డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి వాపసు చేసే కాలం వరకు ఉన్న ఎక్స్‌ట్రా అమౌంట్‌పై సేవింగ్స్ ఖాతా వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకాన్ని మేజర్ అయిన ప్రతి ఒక్కరు ఓపెన్ చేయవచ్చు. ముగ్గురు కలిసి జాయింట్‌ అకౌంట్‌ కూడా ఓపెన్ చేయవచ్చు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి తరపున, మైనర్ల తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ ప‌థ‌కంలో డిపాజిట్లు రూ.1000 నుంచి ప్రారంభించొచ్చు. ఉమ్మడి ఖాతాలో ఖాతాదారులంద‌రికీ స‌మానంగా వాటా ఉంటుంది. ఇందులో 5 సంవ‌త్సరాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఒక‌వేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మ‌ర‌ణిస్తే ఖాతా మూసివేయ‌వ‌చ్చు. నామినీ/ చ‌ట్టబ‌ద్ధమైన వార‌సుల‌కు ఖాతాలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తారు. డ‌బ్బు వాప‌సు చేసే ముందు నెల వ‌ర‌కు వ‌డ్డీ చెల్లిస్తారు. డిపాజిట్‌ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్‌ మొత్తం సొమ్ముపై 2 శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి, ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్‌పై 1 శాతం కోత విధిస్తారు.

గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!

Pan Card: పాన్‌కార్డ్‌ పోయిందా.. మరేం పర్వాలేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..!

Buttermilk For Weight Loss: మజ్జిగలో ఇవి కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు.. అవేంటంటే..?