Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్‌కార్డ్‌ పోయిందా.. మరేం పర్వాలేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..!

Pan Card: ఆధార్‌ కార్డుతో పాటు పాన్‌కార్డు కూడా గుర్తింపు పత్రాలలో ఒకటి. దీనిని ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన

Pan Card: పాన్‌కార్డ్‌ పోయిందా.. మరేం పర్వాలేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..!
Pan Card
Follow us
uppula Raju

|

Updated on: Feb 26, 2022 | 8:58 AM

Pan Card: ఆధార్‌ కార్డుతో పాటు పాన్‌కార్డు కూడా గుర్తింపు పత్రాలలో ఒకటి. దీనిని ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన పనులలో ఉపయోగిస్తారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ పాన్‌కార్డ్‌ని జారీ చేస్తుంది. పాన్‌కార్డుని పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్ అంటారు. అంకెలు, అక్షరాలు కలిపి 10 ఉంటాయి. ఆదాయ పన్ను చెల్లించే వారందరికీ, ఇతరుల తరఫున ఆదాయ పన్ను రిటర్స్ చేసే వారికి, బ్యాంకు ఖాతా ఉన్నవారికి పాన్ కార్డు అవసరమవుతుంది. రూ. 50వేల పైబడి బ్యాంకు డిపాజిట్ల సమయంలో, బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో, డీ మ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఓపెన్‌ చేసేటప్పుడు, 50 వేల చెక్కులు, డీడీల లావాదేవీల విషయంలో, స్థిరాస్తి, వాహనాల కొనుగోలు, అమ్మకాలు జరిపేటప్పుడు, హోటళ్లు, విలాసాలు, బయానా ఖర్చుల వంటి వాటి కోసం పాన్‌కార్డు అత్యవసరమవుతుంది.

ఇలాంటి ముఖ్యమైన పాన్‌కార్డు పోయినప్పుడు అందరు చాలా కంగారు పడుతారు. కానీ ఇప్పుడు అలాంటి ఆందోళన అవసరం లేదు. డేటాలో ఎటువంటి మార్పు అవసరం లేనట్లయితే పాన్ కార్డ్ రీప్రింట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్‌) అధికారిక వెబ్‌సైట్ నుంచి పాన్‌కార్డుని తిరిగి పొందవచ్చును. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోనే సౌకర్యాన్ని ఎన్‌ఎస్‌డీఎల్‌ కల్పిస్తోంది. మరో విషయం ఏంటంటే మీరు తప్పనిసరిగా మార్చి 31, 2022లోపు మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయాలి.

పాన్ కార్డ్ రీప్రింట్ కోసం ఇలా చేయండి..

1.  వెబ్ సైట్ సందర్శించాలి

2. పాన్, ఆధార్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.

3. మొబైల్‌ నెంబర్, తదితర వివరాలను అందించాలి.

4. భారతదేశంలో పాన్‌కార్డు ఛార్జీలు రూ. 50.

5. విదేశాలకి పాన్‌కార్డుని పంపడానికి రూ. 959

ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్

1. మొదట ఈ ఎన్‌ఎస్‌డీఎల్ పోర్టల్ లింకు ఓపెన్ చేయండి.

2. పోగొట్టుకున్న మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పిన్ కోడ్ నమోదు చేయాలి.

4. మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.

5. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీరు ఈ-పాన్ కార్డు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులకు అలెర్ట్.. ఆ గడువు మరో రెండు రోజులే.. పూర్తి వివరాలు

Gangubai Kathiawadi: కంగనా కొంటర్లు.. అలియా గంగూభాయ్‌కి ప్లెస్ అయ్యాయా..?

BJP Politics: రహస్య సమావేశాలతో హడావిడి చేసిన నేతలతో.. రాష్ట్ర పార్టీ చీఫ్ సంధి చర్చలు