Gangubai Kathiawadi: కంగనా కౌంటర్లు అలియా గంగూభాయ్‌కి ప్లస్ అయ్యాయా..?

బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌పై విరుచుకుపడుతున్న కంగనా రనౌత్‌ లేటెస్ట్‌గా అలియాను టార్గెట్‌ చేశారు. గంగూబాయ్‌ కతియావాడి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు

Gangubai Kathiawadi: కంగనా కౌంటర్లు అలియా గంగూభాయ్‌కి ప్లస్ అయ్యాయా..?
Kangana Ranaut , Gangubai K
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2022 | 3:06 PM

Gangubai Kathiawadi: బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌పై విరుచుకుపడుతున్న కంగనా రనౌత్‌ లేటెస్ట్‌గా అలియాను టార్గెట్‌ చేశారు. గంగూబాయ్‌ కతియావాడి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అలియాపై తనదైన స్టైల్‌లో హాట్ కామెంట్స్ చేస్తున్నారు కంగనా.. ఇంతకీ అలియాపై కంగన చేస్తున్న విమర్శలేంటి..? వాటికి… అలియా ఇస్తున్న కౌంటర్‌ ఏంటి ఇప్పడు చూద్దాం.. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన గంగూబాయ్ కతియావాడి సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. తమ కుటుంబాన్ని తప్పుగా చూపించారంటూ గంగూబాయ్ ఫ్యామిలీ.. తమ ప్రాంతాన్ని తప్పుగా చూపించారంటూ కొంతమంది లోకల్‌ లీడర్స్‌ ఈ మూవీపై కోర్టుకెక్కారు. ఇది చాలదన్నట్టుగా కంగన కూడా గంగూబాయ్‌ టీమ్‌ను సీరియస్‌గా ఎటాక్ చేస్తున్నారు.

రీసెంట్‌గా గంగూబాయ్ సినిమాలో అలియా చెప్పిన డైలాగ్‌ను ఓ చిన్నారి ఇమిటేట్ చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చిత్రయూనిట్‌ కూడా షేర్ చేయటంతో మరింతగా ట్రెండ్ అయ్యింది. అయితే ఈ వీడియో మీదే విమర్శలకు దిగారు కంగనా. వేశ్యకథగా తెరకెక్కించిన ఈ సినిమా గురించి చిన్నపిల్లలతో రీల్స్ చేయించటం ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా కామెంట్స్‌పై అలియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కంగనా పేరు ప్రస్థావించకపోయినా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు అలియా. ఆ చిన్నారి అంత క్వాలిటీతో రీల్ చేశారంటే ఆ టైమ్‌లో ఆమె పేరెంట్స్ కచ్చితంగా అక్కడ ఉండే ఉంటారు. సో… పేరెంట్స్‌ ప్రెజెన్స్‌లో చిన్నారి వీడియో రీల్స్ చేయటం అంత అభ్యంతరకర విషయమేం కాదు అన్నది అలియా చెబుతున్న వెర్షన్‌.  ఈ మాటల సంగతి పక్కన పెడితే.. వివాదాలతో గంగూబాయ్‌కి మంచి ప్రమోషన్ దక్కుతోంది. విమర్శలు-వివాదాల కారణంగా నిత్యం వార్తల్లో కనిపించటం సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్‌. మరి ఈ ఎడ్వాంటేజ్‌ను యూనిట్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..