Ajay Devgn : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బాలీవుడ్ స్టార్ హీరో.. నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా..
ఒకేసారి రెండు సౌత్ రీమేక్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం 2ను రీమేక్ చేస్తున్న అజయ్..
Ajay Devgn : ఒకేసారి రెండు సౌత్ రీమేక్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం 2ను రీమేక్ చేస్తున్న అజయ్.. తమిళ సూపర్ హిట్ ఖైదీ రీమేక్‌లనూ నటిస్తున్నారు. రెండు సినిమాలను ఆల్టర్నేట్ షెడ్యూల్స్‌లో ప్యారలల్‌గా కంప్లీట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఖైదీ రీమేక్‌గా తెరకెక్కుతున్న భోళాకు సంబంధించి ఇంటెన్స్ సీన్స్ కంప్లీట్ చేశారు.
భోళా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే దృశ్యం 2 సెట్‌లో అడుగుపెట్టారు అజయ్. మార్చి ఫస్ట్ వీక్ వరకు దృశ్యం షూటింగ్‌లోనే పాల్గొంటారు. ఆ తరువాత ఓ ఐలాండ్‌లో వేసిన పోలీస్ స్టేషన్ సెట్‌లో భోళా షూటింగ్ రీ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే క్లైమాక్స్ ఎపిసోడ్‌ను కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
సౌత్ సినిమాలు నార్త్‌లో రీమేక్ చేస్తున్న అజయ్.. స్టోరీ సోల్ మార్చకపోయినా.. ట్రీట్మెంట్ మాత్రం పూర్తిగా మార్చేస్తున్నారట. ముఖ్యంగా ఖైదీ రీమేక్ విషయంలో మెయిన్ ప్లాట్ మాత్రమే తీసుకొని నార్త్ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా డిఫరెంట్ ట్రీట్మెంట్‌తో సినిమా చేస్తున్నారట. మరి ఈ చేంజెస్ నార్త్ ఆడియన్స్‌ను ఎంత వరకు ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి. ఇక అజయ్ దేవగన్ జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు అజయ్ దేవగన్.
మరిన్ని ఇక్కడ చదవండి :