AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

March Changes: మార్చిలో జరిగే ఈ 5 మార్పుల వల్ల అందరికి నష్టమే.. ఆర్థిక స్థితిపై పెను ప్రభావం..!

March Changes: మార్చి 1 తేదీ నుంచి చాలా విషయాలలో మార్పులు సంభవిస్తు్న్నాయి. ఛార్జీలు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల జేబులకి మళ్లీ చిల్లుపడక తప్పదు.

March Changes: మార్చిలో జరిగే ఈ 5 మార్పుల వల్ల అందరికి నష్టమే.. ఆర్థిక స్థితిపై పెను ప్రభావం..!
Money
uppula Raju
|

Updated on: Mar 01, 2022 | 4:07 PM

Share

March Changes: మార్చి 1 తేదీ నుంచి చాలా విషయాలలో మార్పులు సంభవిస్తు్న్నాయి. ఛార్జీలు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల జేబులకి మళ్లీ చిల్లుపడక తప్పదు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన అనేక నియమాలు మారుతున్నాయి. ఈ కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో ఒకటి అమూల్‌ పాల ధరల పెంపు. ఈ పాల కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ధరలు పెంచింది. ఢిల్లీ ఎన్‌సిఆర్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతాలలో మార్చి ఒకటి నుంచి పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే మరోసారి గ్యాస్‌ ధరలు కూడా పెరిగాయి. మార్చి 1 నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు రూ.105 పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012 కానుంది. 5 కిలోల సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో 569 రూపాయలు పలుకుతోంది.

ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా క్లోజ్‌పై రూ.150 + GST ​​వసూలు చేయడానికి సిద్దంగా ఉంది. ఈ నియమం మార్చి 5 2022 నుంచి వర్తిస్తుంది. దీంతో ఖాతాదారులకి తప్పవు తిప్పలు. అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) అన్ని శాఖలు DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (DBIL)లో విలీనం అవుతున్నాయి. కస్టమర్‌లు ఇప్పుడు NEFT/RTGS/IMPS నిధులను పొందడానికి కొత్త IFSC & MICR కోడ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. పాత IFSC కోడ్‌లు ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. 1 మార్చి 2022 నుంచి కస్టమర్‌లు కొత్త DBS IFSC కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ దారులు లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించడానికి ఫిబ్రవరి 28 చివరితేదీగా నిర్ణయించింది. ఈ గడువును పొడిగించడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించని పెన్షన్ దారులు మార్చి 1 నుంచి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకి రూ. 4,950 వడ్డీ.. ఎఫ్డీలతో పోల్చితే చాలా ఎక్కువ..!

Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ ఆకుకూర విషంతో సమానం.. అస్సలు తినకండి..!

గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!

Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!