Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ ఆకుకూర విషంతో సమానం.. అస్సలు తినకండి..!

Kidney Stone: మారుతున్న జీవన శైలి, బిజీ షెడ్యూల్‌ కారణంగా చాలామంది నీరు తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు చాలా

Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ ఆకుకూర విషంతో సమానం.. అస్సలు తినకండి..!
Kidney Stones
Follow us
uppula Raju

|

Updated on: Mar 01, 2022 | 3:33 PM

Kidney Stone: మారుతున్న జీవన శైలి, బిజీ షెడ్యూల్‌ కారణంగా చాలామంది నీరు తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది. డాక్టర్‌ని సంప్రదించి ప్రత్యేక డైట్‌ పాటించాల్సి ఉంటుంది. కిడ్నీలో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు గట్టిపడి రాళ్లుగా మారుతాయి. వీటివల్ల మూత్ర విసర్జన సమసయంలో విపరీతమైన నొప్పి, పొత్తికడుపు నొప్పి, వికారం వంటివి వేధిస్తాయి. సాధారణంగా మనందరి శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన భాగం. ఇవి శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపిస్తుంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, అన్నిటికన్నా ముఖ్యంగా తగినంత నీరు అవసరం. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యలని ఎదుర్కొనే వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కచ్చితంగా కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. పాలకూర, ఉప్పు, టొమాటో వంటివి పూర్తిగా నిషేధించాలి. లేకపోతే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. ప్రస్తుత తరుణంలో కిడ్నీలో రాళ్లనేది ప్రధాన సమస్యగా మారింది. లైఫ్‌స్టైల్‌లో మార్పుల కారణంగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. కిడ్నీలో సమస్య ఉంటే అది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం, దీర్ఘకాలం డీ హైడ్రేషన్ బారిన పడటం తదితర కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు పాలకూరను పూర్తిగా దూరం పెట్టాల్సిందే. పాలకూరలో ఉండే ఆక్సలేట్ కాల్షియంను పెంచుతుంది. దీనివల్ల యూరిన్ ఫ్రీగా అవ్వదు. అందుకే కిడ్నీ సమస్య ఉన్నప్పుడు పాలకూర తినకపోవడం మంచిది. లేకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. చాక్లెట్లు కూడా ఈ రోగులకు మంచివి కావు. దీనివల్ల కిడ్నీ సైజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో కూడా ఆక్సలేట్ ఉంటుంది. అందుకే కిడ్నీలో రాళ్లున్నవారు చాక్‌లెట్లు మానేయ్యాలి. ఇక టొమాటో కూడా కిడ్నీలో రాళ్లుండే రోగులకు విషంతో సమానం. టొమాటోలో ఆక్సిలేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు ఏ మాత్రం మంచిది కాదు.

ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకి రూ. 4,950 వడ్డీ.. ఎఫ్డీలతో పోల్చితే చాలా ఎక్కువ..!

గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!

Cricketers Fight Video: మైదానంలో కొట్టుకున్న క్రికెటర్లు.. ఇప్పుడు నిషేధం అనుభవిస్తున్నారు.. వీడియో చూస్తే షాక్‌..!