iPhone SE 5G: ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్.. రూ.15000లకే ఐఫోన్?
iPhone SE: భారత్‌లో ఐఫోన్ ఎస్‌ఈ ధర భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 8న జరగనున్న కార్యక్రమంలో ఐఫోన్ ఎస్‌ఈ5జీ మోడల్‌ను యాపిల్ విడుదల చేయవచ్చని,..
iPhone SE 5G: భారత్‌లో ఐఫోన్ ఎస్‌ఈ ధర భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 8న జరగనున్న కార్యక్రమంలో ఐఫోన్ ఎస్‌ఈ5జీ మోడల్‌ను యాపిల్ విడుదల చేయవచ్చని, ఐఫోన్ ఎస్‌ఈ5G (iPhone SE 5G) ధరను భారీగా తగ్గే అవకాశాలున్నాయని బ్లూమ్‌బర్గ్ నివేదిక (Bloomberg Rreport) పేర్కొంది. ఐఫోన్ ధర 199 డాలర్లు (దాదాపు రూ.15000)కు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే భారతదేశంలో విడుదలైనప్పుడు ఈ ఫోన్ ధర రూ.42,500గా నిర్ణయించింది కంపెనీ. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఇతర ఈ-కామార్స్ వెబ్‌సైట్లలో రూ.26,999లకే లభిస్తోంది.
అయితే ఆఫర్ల కింద ఈ ఫోన్ రూ.15వేలకే లభించే అవకాశం ఉంది. తాజాగా వచ్చే వార్తలు నిజమైనట్లయితే భారత్‌లో ఈ ఫోన్ కొనుగోలుదారులను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా భారత్‌లో విక్రయిస్తున్న కంపెనీ గణనీయమైన వృద్ధి సాధించినా, ప్రీమియం విభాగానికే పరిమితమైంది. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో ఏడాది క్రితంతో పోలిస్తే 34 శాతం అధికంగా యాపిల్ 23 లక్షల ఫోన్‌లను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినప్పటికీ భారత్ మార్కెట్లో యాపిల్ వాటా 5 శాతంలోపే ఉంది. అయితే రూ.20 వేలలోపు ఐఫోన్‌లను తీసుకువచ్చినట్లయితే కొనుగోలుదారులు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: