Watch Video: యూపీలో దారుణం.. ఎన్నికల విధుల్లో ఉన్న మహారాష్ట్ర పోలీసులపై దాడి..

Attack on Police: ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh) ఎన్నికల విధుల్లో ఉన్న మహారాష్ట్ర పోలీసులపై రాళ్ల దాడి చేశారు దుండగులు. లాఠీలతోనూ పోలీసులపై తీవ్రంగా దాడి చేశారు.

Watch Video: యూపీలో దారుణం.. ఎన్నికల విధుల్లో ఉన్న మహారాష్ట్ర పోలీసులపై దాడి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 02, 2022 | 7:18 AM

Attack on Police: ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh) ఎన్నికల విధుల్లో ఉన్న మహారాష్ట్ర పోలీసులపై రాళ్ల దాడి చేశారు దుండగులు. లాఠీలతోనూ పోలీసులపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు. ఈ ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ధ్వంసమైంది. ఈ ఘటన ప్రయాగ్​రాజ్ సమీపంలో జరిగింది. బస్సు బలరామ్‌పుర్​నుంచి థాన్‌పుర్​గ్రామానికి చేరుకునేటప్పటికే, నడిరోడ్డుపై బైఠాయించారు గూండాలు. బస్సు డ్రైవర్​హారన్​ కొట్టినప్పటికీ పక్కకు తప్పుకోలేదు. దీంతో కిందకు దిగి వారిని తప్పించే ప్రయత్నం చేశారు కొందరు పోలీసులు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాహనంపై రాళ్లు రువ్వారు దుండగులు. మహారాష్ట్ర పోలీసుల (Maharashtra Police) దగ్గర ఉన్న లాఠీలు గుంజుకొని, దాడికి తెగబడ్డారు గూండాలు. దీంతో చాలామంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని ప్రశ్నిస్తున్నారు. దాడికి పాల్పడ్డ మిగిలినవారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోలీసులకే రక్షణ లేకపోతే, ఇక ప్రజల పరిస్థితి ఏంటని అంటున్నారు స్థానికులు. అయితే, ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. వారి వెనుక రాజకీయ నేతలు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మహారాష్ట్ర పోలీసులపై దాడి చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అంటున్నారు పొలిటికల్ లీటర్స్‌. ఈ మధ్యే ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఢిల్లీ వెళ్తు్న్న అసదుద్దీన్ ఓవైసీ కారుపై, ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర 3-4 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఎన్నికల ముందు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది.

Also Read:

Russia-Ukraine war Effect: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఎంత.. వాణిజ్యంలో రెండు దేశాలు పరస్పరం ఎంతమేర ఆధారపడ్డాయి..

Viral Photo: తగ్గేదే..లే! ఈ ఫోటోలో పామును కనిపెట్టాలంటే.. మీ కళ్లల్లో పవర్ ఉండాల్సిందే!