Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: యూపీని చుట్టేసిన అగ్రనేతలు.. ప్రధాని మోడీ నుంచి మమతా వరకు అంతా అక్కడే..

దేశీకి నేతలు అంతా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ప్రచారంపై ఫోకస్ పెట్టారు. యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీ నుంచి మొదలు.. బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ వరకు అంతా అక్కడే ఉన్నారు.

UP Election 2022: యూపీని చుట్టేసిన అగ్రనేతలు.. ప్రధాని మోడీ నుంచి మమతా వరకు అంతా అక్కడే..
Up Election Pm Modis
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 02, 2022 | 9:56 AM

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 (UP Assembly Elections 2022) చివరి రెండు దశలు మాత్రమే మిగిలి వుంది. చివరి అంకానికి చేరుకుంటుండటంతో అన్ని పార్టీ పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టాయి. యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో(PM Narendra Modi)సహా బిజెపికి(BJP) చెందిన పెద్ద నాయకులందరి బహిరంగ సభలు(public meeting), రోడ్ షోల్లో(Road Show) పాల్గొంటున్నారు. బీజేపీతోపాటు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. కాగా, అఖిలేష్ యాదవ్‌కు మద్దతుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ వారణాసి చేరుకోనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రచారంలో పోటీ పడుతోంది. ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఈరోజు వారణాసిలో బహిరంగ సభ, రోడ్ షోలో కనిపించనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, స్వతంత్ర దేవ్ సింగ్ ఈరోజు పూర్వాంచల్‌లోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..

ప్రధాని మోదీ బుధవారం యూపీలో రెండు బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఒకటి  సోన్‌భద్ర (రాబర్ట్స్‌గంజ్) మధ్యాహ్నం 1 గంటలకు.. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఘాజీపూర్‌లో బహిరంగ సభలు ప్రసంగిస్తారు.

ఈరోజు యూపీలో అమిత్ షా మూడు బహిరంగ సభలు

ఉదయం 11.45 గంటలకు బాల్మీకి ఇంటర్ కళాశాల, బలువా, సకల్దిహా, చందౌలీలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు క్రిషక్ ఇంటర్ కళాశాల, కెరకట్, మచ్లిషహర్, జౌన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బాబు నక్కీ సింగ్ మెమోరియల్ కళాశాల, మొహబ్బత్‌పూర్, షాఘర్, ముబారక్‌పూర్, అజంగఢ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు యూపీలో 2 బహిరంగ సభలు

ఉదయం 11.30 గంటలకు డియోరీ విరోహి మిర్జాపూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు చందౌలీలోని దీన్ దయాళ్ నగర్‌లోని బాబూరి జూనియర్ హైస్కూల్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈరోజు జౌన్‌పూర్‌లో ఎన్నికల పర్యటనలో ఉన్నారు

జమునియా కా మైదాన్‌లోని గజరాజ్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లో ఉదయం 11:30 గంటలకు వర్కర్స్ కాన్ఫరెన్స్  ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు బద్లాపూర్‌లోని ఫదర్‌పూర్ గ్రౌండ్‌లో వర్కర్స్ కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా జాసోపూర్ లో జరిగే కార్మికుల సదస్సులో మాట్లాడుతారు.  మధ్యాహ్నం 1:30 గంటలకు, చాకియా వర్క్ తర్వాత MKD పబ్లిక్ స్కూల్, సరాయ్ రైచండా, సుజంగజ్ రోడ్ షోలో పాల్గొంటారు. ముంగ్రా బాద్‌షాపూర్‌లో మధ్యాహ్నం 2:40 గంటలకు కాన్ఫరెన్స్  ప్రచారాన్ని నిర్వహిస్తారు. 3:30 గంటలకు నంహకురం మహావిద్యాలయ, రామ్‌ఘర్, బరన్వాలో వర్కర్స్ కన్వెన్షన్.

యూపీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా షెడ్యూల్..

ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు సోన్‌భద్రలో బహిరంగ సభ నిర్వహిస్తారు. వారణాసిలోని మహమూర్‌గాంజ్‌ రోడ్డులోని అమల్టాస్‌ అపార్ట్‌మెంట్స్‌లోని రథయాత్రలో సాయంత్రం 4.30 గంటలకు పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు వారణాసిలోని హోటల్ డి ప్యారిస్‌లో మేధావుల సమావేశంలో ప్రసంగిస్తారు.

మమతా బెనర్జీ వారణాసిలో ఉంటారు

బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ప్రధానమంత్రి మోడీ ఇలాక వారణాసి పర్యటిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆమె విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు దశాశ్వమేధ ఘాట్‌కు వెళ్లి గంగాపూజ, గంగా హారతిలో పాల్గొంటారు. మరుసటి రోజు, మార్చి 3న, దాదాపు 10:30 గంటలకు, ఆమె హోటల్ నుండి ఈడే గ్రామానికి వెళుతారు. అక్కడ మమతా, అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ తిరిగి హోటల్‌కు వచ్చి పార్టీ ఆఫీస్ బేరర్లు, కూటమి నేతలతో సమావేశమై ఎన్నికలపై చర్చించిన తర్వాత తిరిగి వెళ్తారు.

ఇవి కూడా చదవండి: Viral Video: ఇదేందయ్య ఎప్పుడూ చూడలే..! పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..