వేసవి కాలం వచ్చేసింది. ఎండ తాపం నుంచి కాపాడే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో వందకు పైగా రకాలున్నాయంటే అతిశయం కాదు. మన దగ్గర ఐదారు రకాలు మాత్రమే దొరుకుతాయి
TV9 Telugu
ఈ సీజన్‌లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, చల్లగా ఉంచడానికి పుచ్చకాయ మంచి ఎంపిక. ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, రిబోఫ్లేవిన్, ఐరన్, కాల్షియం, జింక్, ఫైబర్, నియాసిన్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
మంట, తాపాలను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం మంచిది
TV9 Telugu
92 శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు. కండరాల నొప్పులను నిరోధిస్తుంది
TV9 Telugu
ఇన్ని ప్రయోజనాల ఉన్నప్పటికీ పుచ్చకాయను ఏ టైంలో తింటే అధిక ప్రయోజనాలు పొందొచ్చు అనే విషయంలో చాలా మందికి సందేహాలున్నాయి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే
TV9 Telugu
ఉదయం అల్పాహారంలో పుచ్చకాయ తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నం కూడా తినవచ్చు. అయితే ఉదయం అల్పాహారంలో పుచ్చకాయ తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. పుచ్చకాయలో ఉండే సోడియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి
TV9 Telugu
దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. మీరు చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే, మీ ఆహారంలో పుచ్చకాయను చేర్చుకోవడం మంచిది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తొలగిస్తుంది