Credit Card Rules: ఏప్రిల్ 1 నుండి SBI, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల్లో కీలక మార్పులు!
Credit Card Rules: ఇప్పటి నుండి తమ కార్డులను పునరుద్ధరించుకునే కస్టమర్‌లు కోల్పోయిన ప్రయోజనాలకు పరిహారంగా ఒక సంవత్సరం వార్షిక రుసుము క్రెడిట్‌ను పొందుతారు. ఈ మార్పులన్నీ ఏప్రిల్ 2025 నుండి అమలులోకి రానున్నాయి. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కస్టమర్లు..

Credit Card Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు జరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అనేక బ్యాంకుల క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు చాలా మార్పులు జరగబోతున్నాయి. ఈ విషయంలో భారతదేశపు అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), IDFC ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లు వారి క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏప్రిల్ 1, 2025 నుండి ఈ మార్పులు జరగనున్నాయి. ఇది వారి వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తుంది.
SBI కార్డ్‌లో మార్పులు:
ఎస్‌బీఐ కార్డులపై కొన్ని రివార్డ్ పాయింట్లు, సౌకర్యాలు మారబోతున్నాయి. ఉదాహరణకు, SimplyCLICK Swiggy క్రెడిట్ కార్డ్‌పై రివార్డ్ పాయింట్లు ఇప్పుడు 10X నుండి 5Xకి తగ్గించనుంది. దీని కారణంగా, స్విగ్గీ ద్వారా ఉపయోగించే సేవలకు కస్టమర్లకు తక్కువ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. దీనితో పాటు, ఎయిర్ ఇండియా సిగ్నేచర్ కార్డుపై లభించే రివార్డ్ పాయింట్లు కూడా తగ్గించనుంది బ్యాంకు. ఇది 30 నుండి 10 కి తగ్గుతుంది.
దీని అర్థం ఎయిర్ ఇండియాతో ప్రయాణించే కస్టమర్లకు కూడా తక్కువ పాయింట్లు లభిస్తాయి. ఎస్‌బీఐ కార్డ్ అందించే ఉచిత బీమా కవర్ కూడా జూలై 26, 2025 నుండి నిలిపివేయనుంది. ఇందులో రూ.50 లక్షల విమాన ప్రమాద కవరేజీ, రూ.10 లక్షల రైల్వే ప్రమాద కవరేజీ కూడా ఉన్నాయి.
IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డ్‌లో మార్పులు:
IDFC ఫస్ట్ బ్యాంక్ క్లబ్ విస్తారా కార్డ్ సభ్యులు మార్చి 31, 2025 తర్వాత వోచర్లు, క్లబ్ విస్తారా సిల్వర్ సభ్యత్వం వంటి ప్రయోజనాలను పొందలేరు. దీనితో పాటు కస్టమర్లు మార్చి 31, 2026 వరకు మహారాజా పాయింట్లను పొందవచ్చు. అయితే దాని విలువ తగ్గుతుంది. అదనంగా ప్రీమియం ఎకానమీ ఛార్జీలతో అధిక ధరల టిక్కెట్లకు మైలురాయి వోచర్లు జారీ చేయదు.
ఇప్పటి నుండి తమ కార్డులను పునరుద్ధరించుకునే కస్టమర్‌లు కోల్పోయిన ప్రయోజనాలకు పరిహారంగా ఒక సంవత్సరం వార్షిక రుసుము క్రెడిట్‌ను పొందుతారు. ఈ మార్పులన్నీ ఏప్రిల్ 2025 నుండి అమలులోకి రానున్నాయి. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కస్టమర్లు SBI కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: Petrol, Diesel Tax: దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఏ రాష్ట్రాల్లో ఎంత?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి