AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone Charging Port: తదుపరి ఐఫోన్‌లో ఛార్జింగ్ పోర్ట్ ఉండదు.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆపిల్‌!

iPhone Charging Port: గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ పోర్ట్-లెస్ ఐఫోన్‌ను తయారు చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ, ఇప్పుడు కంపెనీ నెమ్మదిగా వైర్‌లెస్ ఎకోసిస్టమ్ వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో మాగ్‌సేఫ్ ఛార్జింగ్‌ను కొనసాగించడం, వైర్‌లెస్ డేటా బదిలీ వేగాన్ని మెరుగుపరచడం వంటి పనులు కూడా..

iPhone Charging Port: తదుపరి ఐఫోన్‌లో ఛార్జింగ్ పోర్ట్ ఉండదు.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆపిల్‌!
Subhash Goud
|

Updated on: Mar 20, 2025 | 2:51 PM

Share

iPhone Charging Port: ఆపిల్ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఐఫోన్ మోడళ్లలో మీరు కీలక మార్పులను చూడవచ్చు. ఇటీవలి నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్ లేకుండా కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఆ కంపెనీ భవిష్యత్ డిజైన్‌పై పని చేస్తోంది. రాబోయే కొత్త ఐఫోన్‌ను పోర్ట్ లేకుండా అందించాలని యోచిస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ పోర్ట్-లెస్ ఐఫోన్‌ను తయారు చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ, ఇప్పుడు కంపెనీ నెమ్మదిగా వైర్‌లెస్ ఎకోసిస్టమ్ వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో మాగ్‌సేఫ్ ఛార్జింగ్‌ను కొనసాగించడం, వైర్‌లెస్ డేటా బదిలీ వేగాన్ని మెరుగుపరచడం వంటి పనులు కూడా ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ విజయవంతమైతే, భవిష్యత్తులో పూర్తిగా పోర్ట్-రహిత మోడళ్లను విడుదల చేయడంపై కంపెనీ దృష్టి సారిస్తుందని ఆపిల్ అధికారులు విశ్వసిస్తున్నారు.

డిజైన్‌లో ఇప్పటికే మార్పులు:

ఇవి కూడా చదవండి

ఆ కంపెనీ గతంలో ఐఫోన్ 7లో హెడ్‌ఫోన్ జాక్‌ను తీసివేసి, ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో టచ్ ఐడికి బదులుగా ఫేస్ ఐడిని జోడించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ కంపెనీ ఛార్జింగ్ పోర్టును తొలగించడానికి కదులుతోంది. ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ లేకుండా ఫోన్‌లోకి నీరు, ధూళి ప్రవేశించడానికి రంధ్రం ఉండదు. పోర్ట్-లెస్ ఐఫోన్ ప్రయోజనం ఏమిటంటే అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది.

ఈ వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు:

వైర్డు డేటా బదిలీపై ఆధారపడే వారికి, ముఖ్యంగా అధిక రిజల్యూషన్ వీడియోలను షూట్ చేసే వారికి ఇది ఒక సవాలుగా ఉంటుంది. అలాంటి వారికి పెద్ద ఫైళ్లను వైర్‌లెస్‌గా బదిలీ చేయడం కష్టం కావచ్చు.

ఐఫోన్ 17 సిరీస్ విడుదల తేదీ:

ఆపిల్ గత ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా కంపెనీ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను అంటే ఐఫోన్ 17ను సెప్టెంబర్-అక్టోబర్ నెలలో విడుదల చేయవచ్చు. ఈసారి ఈ సిరీస్‌లో పెద్ద మార్పు ఉంటుంది. ఈ సిరీస్‌లో ప్లస్ మోడల్‌కు బదులుగా ఐఫోన్ 17 ఎయిర్‌ను ఆవిష్కరించనున్నారు. కంపెనీ సెప్టెంబర్ 18 లేదా 19 న ఐఫోన్ 17 ను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది.

ఐఫోన్ 17 విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ మార్కెట్లో దాని గురించి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం కంపెనీ దాని ధర గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ వెలువుడుతున్న లీకులను నమ్మినట్లయితే దీని ప్రారంభ ధర దాదాపు రూ. 90,000 ఉండవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..