Ritu Varma: సినిమాకు అవసరమైతే అవి కూడా చేస్తా.. ఓపెన్‌గా చెప్పిన యంగ్ బ్యూటీ రీతూ వర్మ
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఈ పోటీని తట్టుకలోలేక ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా, సైడ్ యాక్టర్స్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత మెయిన్ హీరోలుగా , హీరోయిన్స్ గా చేస్తూ ఉంటారు.

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ జోరు పెంచారు. నార్త్ బ్యూటీస్ కి మేము ఏ మాత్రం తీసిపోము అంటూ నటనలోనూ అందంలోనూ అదరగొడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో చాలా వరకు తెలుగు హీరోయిన్స్ హవా కనిపిస్తుంది. ఇలా స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్న భామల్లో రీతు వర్మ ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారి సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ అక్కడి ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది రీతు వర్మ. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా శీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని, శ్రీవిష్ణు స్వాగ్ సినిమాలు చేసింది. ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది. రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు గేరుమార్చి గ్లామర్ డోస్ పెంచేస్తుంది. ఈ మధ్య రీతు వర్మ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా రీతు వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది అన్న ప్రశ్నకు.. “నాకు ఫైటింగ్ లతో ఉండే మంచి యాక్షన్ పాత్ర చెయ్యాలని ఉంది. అలాగే పూర్తి స్థాయి పీరియడ్ పాత్ర చేయాలనుంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నేను ముద్దు సీన్లు చెయ్యను అనేది ఓరూమర్. కథలో డిమాండ్ ఉండి, కథకు తగ్గట్లుగా అయితే చేస్తాను. గ్లామర్ షోకి కానీ, ముద్దు సీన్లకు వ్యతిరేకం కాదు. బహుశా నేను అలాంటివి చేయను అనుకోని దర్శకులు నాకు ఛాన్స్ లు ఇవ్వడం లేదేమో.. కథలో అవసరం అనుకుంటే చేస్తాను అని చెప్పుకొచ్చింది అందాల భామ రీతు వర్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.